దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం 8 నెలల హుండీ లెక్కింపు జరిగినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు రామయ్య తెలిపారు. ఎనిమిది నెలలకు కలిపి మొత్తం నాలుగు లక్షల రూపాయలు నగదు, మూడు తులాల వెండి సమకూరగా అందులో వివిధ ఖర్చులకు రెండు లక్షలు పోగా మిగిలిన రెండు లక్షలు కళ్యాణమంటపం నిర్మాణానికి ఖర్చు చేస్తామని తెలిపారు.
నిబంధనలకు తూట్లు
దేవరగట్టు హుండీ లెక్కింపులో ఆలయ కమిటీ నిర్వాహకులు నిబంధనలకు తూట్లు పొడిచారు. వీడియో రికార్డింగ్ కెమెరాలు, రెవెన్యూ అధికారులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా హుండి లెక్కించారు. దీనిపై భక్తులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపైఆలయ కమిటీ నిర్వాహకుడు వీర నాగప్పను వివరణ కోరగా హుండీ లెక్కింపును ఇంతకు మునుపు పేపర్ కు ఎవరు రాయలేదని ఇప్పుడు మీరెందుకు అడుగుతున్నారు అంటూ ప్రశ్నించాడు ఇచ్చారు. ఈకార్యక్రమంలో కానిస్టేబులు పెద్దన్న, రాజగోపాల్, ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.