Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Holagunda: బాట, బస్సు లేక విద్యాభ్యాసం ఎలా?

Holagunda: బాట, బస్సు లేక విద్యాభ్యాసం ఎలా?

సుమారు 1000 మందికి పైగా విద్యార్థులు రోజూ బస్సులోనే విద్యాసంస్థలకు వెళ్లొస్తున్నారు

హోలగుంద మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్న ధనాపురం – హోలగుంద – మార్లమడికి రోడ్డు మోకాలి లోతు గుంతలతో కంకర తెలిన రాళ్ళతో ప్రయాణానికి వీలులేకుండా మారినా, వాహనాలు తిరగడానికి పనికి రాదని బస్సులు ఆపివేసినా ప్రజాప్రతినిధులు, అధికారులలో చీమంతైన చలనం లేకపోవడంతో మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు ఏకమై కుల మత రాజకీయాలకతీతంగా జేఏసీ ఏర్పాటు చేసి ప్రయత్నం – పోరాటం – ఉద్యమం అనే నినాదంతో మొదలుపెట్టారు.

- Advertisement -

ఈ మండలంలో సుమారుగా 1000 మందికి పైన విద్యార్థులు బస్సు ఆధారంగా చేసుకుని విద్యనభ్యసిస్తున్నారు. బాట,బస్సు లేక విద్యను అభ్యసించడానికి పాఠశాలకు వచ్చేది ఎలా అంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఎమ్మార్వో హుస్సేన్ సాహెబ్ ను ప్రశ్నిస్తూ ఈ సమస్యపై వెంటనే స్పందించాలని జేఏసీ డిమాండ్ చేసింది.

అత్యవసర పరిస్థితిలో ప్రయాణం చేయాలంటే ఏ గుంతలో ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు ప్రజలు విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు వెంటనే మొదలుపెట్టాలని, అలాగే ధనాపురం – హోలగుంద రోడ్డుకు సంబంధించిన పూర్తి వివరాలు జేఏసీ కి అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తహసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్వో హుస్సేన్ సాహెబ్ కు, ఎంపీడీవో కార్యాలయం ముందు ఎంపీపీ నూర్జహాన్ బి కి స్పందనలో వినతి పత్రం అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News