హొళగుందలో బుధవారం తెల్లవారుజామున ఉలిగమ్మ దేవి దేవర వైభవంగా జరిగింది. అమ్మవారికి తెల్లవారుజామున జలాభిషేకం, రుద్రాభిషేకం, కుంకుమార్చన, బండారు చందన అభిషేకంతో పాటు ఆకుపూజ నిర్వహించి పూలమాలలతో అమ్మవారిని అలంకరించిన అనంతరం.. దేవర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తమ్ముళ్లు దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, వైసిపి ఆలూరు తాలూకా ఇంచార్జ్ నారాయణస్వామికి వైసిపి నాయకుడు తోక వెంకటేష్ టపాకాయలు కాల్చి, పూలు చల్లుకుంటూ, గజమాలతో ఘన స్వాగతం పలికి వచ్చిన వైసీపీ నాయకులందరికీ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మల్లికార్జున,జడ్పీ వైస్ చైర్మన్ బావ కురువ శేషప్ప,మండల కన్వీనర్ షఫీ ఉల్లా,అనుమప్ప, సర్పంచ్ తనయుడు పంపాపతి,ఈసా, వైసిపి సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Holagunda: ఘనంగా శ్రీ ఉలిగమ్మ దేవర
సంబంధిత వార్తలు | RELATED ARTICLES