Homeఆంధ్రప్రదేశ్Anitha: అదంతా కట్టుకథే.. అతని వెనుక ఎవరున్నారో తేలుస్తాం.. హోం మంత్రి అనిత కామెంట్స్‌

Anitha: అదంతా కట్టుకథే.. అతని వెనుక ఎవరున్నారో తేలుస్తాం.. హోం మంత్రి అనిత కామెంట్స్‌

Home minister comments on Pastor Abhinay Issue: పాస్టర్‌ అభినయ్‌ దర్శన్‌ వ్యవహారంపై ఏపీ హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో విచారణ కొనసాగుతోందని, ఈ వ్యవహారంలో పెద్ద కుట్ర ఉందని, దాన్ని నిగ్గుతేలుస్తామని చెప్పారు. కుట్ర లేకపోతే అభినయ్‌ దర్శన్‌ కడప నుంచి అల్లూరి జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందని మంత్రి ప్రశ్నించారు. అభినయ్‌ గిరిజనులను నమ్మించి పాస్టర్ అవతారం ఎత్తారని విమర్శించారు. అభినయ్‌ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనేది త్వరలో బయటపడుతుందని, ఆయన్ను కస్టడీకి తీసుకొని విచారణ చేస్తామని తెలిపారు.

- Advertisement -

Also read: Stock Market: అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన డీల్‌.. లాభాల బాట పట్టిన స్టాక్‌ మార్కెట్..!

రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నమే..

కాగా, కడపకు చెందిన అభినయ్‌ దర్శన్‌పై అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండల పరిధిలో దాడి, హత్యాయత్నం జరిగాయనే ప్రచారమంతా కట్టుకథేనని ఇటీవల పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రచారం కోసం పాస్టర్‌ తనమీద తానే దాడి చేయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా ఆయనదేనని నిగ్గుతేలింది. తన కారుపై దాడి చేసినట్లు, తనను చంపేందుకు ప్రయత్నించినట్లు కొందరు వ్యక్తులతో అభినయ్‌ దర్శన్‌ నటింపజేసి, ఆ దృశ్యాల్ని చిత్రీకరించారు. వాటిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసి తనపై హత్యాయత్నం జరిగిందంటూ అభినయ్‌ ఫేక్‌ ప్రచారం చేసుకున్నారు. తనపై కావాలనే రాష్ట్ర ప్రభుత్వం దాడి చేయించిందంటూ.. బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈ డ్రామాను ఒక ప్లాన్‌ ప్రకారమే రక్తికట్టించారు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో 24 గంటల్లోనే గుట్టు రట్టైంది. పోలీసులు అభినయ్‌ని త్వరలోనే కస్టడీలోకి తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News