Saturday, February 22, 2025
Homeఆంధ్రప్రదేశ్TTD: టీటీడీకి రూ.11కోట్ల భారీ విరాళం

TTD: టీటీడీకి రూ.11కోట్ల భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కి మరో భారీ విరాళం అందింది. శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు ముంబైలోని ప్రసిద్ యునో ఫ్యామిలీ ట్రస్టుకు చెందిన తుషార్‌ కుమార్‌ అనే భక్తుడు రూ.11 కోట్ల విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందజేసిన తుషార్‌ కుమార్‌ను ఆయన అభినందించారు.

- Advertisement -

అలాగే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వెంకటరమణ రూ.10 లక్షలు, తిరుపతికి చెందిన సాధు పృథ్వీ ఎస్వీ రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. ఇదిలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు టోకెన్లు లేని భక్తులకు 8 గంటలు పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఆదివారం శ్రీవారిని 79,705 మంది భక్తులు దర్శించుకోగా 24,836 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు ఆదాయం వచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News