Homeఆంధ్రప్రదేశ్TDP Mahanadu: టీడీపీ మహానాడు తొలిరోజే భారీ విరాళాలు.. ఎవరెంత ఇచ్చారంటే?

TDP Mahanadu: టీడీపీ మహానాడు తొలిరోజే భారీ విరాళాలు.. ఎవరెంత ఇచ్చారంటే?

Huge donations on Mahanadu first day: టీడీపీ కార్యకర్తలు పసుపు పండుగగా జరుపుకునే మహానాడు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశం తొలిరోజు కీలక తీర్మాణాలతో విజయవంతంగా ముగిసింది. ప్రవేశపెట్టిన వివిధ తీర్మానాలపై 48 మంది నేతలు మాట్లాడారు. పార్టీకి తొలిరోజు సుమారు రూ.12 కోట్ల విరాళాలు అందాయి. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి దంపతులు కార్యకర్తల సంక్షేమ నిధికి రూ.5 కోట్లు విరాళం ప్రకటించారు. ఎంపీ సానా సతీష్‌ రూ.1.5 కోట్లు, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, భాష్యం రామకృష్ణ రూ. కోటి చొప్పున ప్రకటించారు.

- Advertisement -

Also read: Prof K Nageshwar: అదే జరిగితే నా ఆత్మకథ రాసుకుంటా..! ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు

తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌కు మాట్లాడే అవకాశం..

మహానాడు చరిత్రలో తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్‌కు మాట్లాడే అవకాశాన్ని పార్టీ కల్పించింది. ఎమ్మెల్యే గల్లా మాధవి పీఏ వర్షిణి (ట్రాన్స్‌జెండర్‌) మాట్లాడారు. 2014-19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం ట్రాన్స్‌జండర్లకు పింఛన్లు, ఇళ్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తమ జీవితాల్లో మళ్లీ ఆశలు చిగురించాయని, మా జీవితాల్లో మంచి రోజులు వచ్చాయని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News