HomeTop StoriesCrime: కూతురు ప్రసవం.. ఆస్పత్రిలో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Crime: కూతురు ప్రసవం.. ఆస్పత్రిలో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Kurnool Tragedy Husband Kills Wife: కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రాణం పోసిన చోటే మరో ప్రాణం పోయింది. కూతురు ప్రసవానికి ఆస్పత్రికి వెళ్లిన భార్యను అక్కడే హతమార్చాడు. ఈ సంఘటనతో ఆస్పత్రిలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/ipl-2026-punjab-kings-beat-lucknow-supergiants-by-54-runs/

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కట్టుకున్న భార్యను భర్తే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన కలకలం సృష్టిస్తోంది. గుడేకల్​కు చెందిన రామయ్య, నరసమ్మ దంపతుల కూతురు ఆసుపత్రిలో శనివారం ప్రసవించింది. దంపతుల మధ్య గొడవల కారణంగా మృతురాలు నరసమ్మ.. భర్త రామయ్యకు కొంత కాలంగా దూరంగా ఉంటోంది.

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/hyderabad-cyber-crime-police-bust-massive-cyber-fraud-network-involved-banks/

ఈ క్రమంలో కూతురికి కాన్పు కావడంతో చూసేందుకు రామయ్య ఆస్పత్రికి వచ్చాడు. భార్యతో మాట్లాడుతూ ఒక్కసారిగా కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన నరసమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రిలో సీసీ ఫుటేజ్ పోలీసులు పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News