Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే: చంద్రబాబు

CM Chandrababu: ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే: చంద్రబాబు

ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే(Savitribai Phule)కి ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) నివాళులు అర్పించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

‘స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆమెకు ఘననివాళి. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయం. ఆనాటి ఆమె చొరవ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత సిద్ధాంతానికి ఆలంబనగా మారి మహిళా రిజర్వేషన్లకు దారి తీసిన విషయం తెలిసిందే. కులమత భేదాలకు అతీతంగా సమాజం కోసం తపించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరొక్క మారు ఆమెకు ఘననివాళి అర్పిస్తున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad