ఆలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీలో రోజురోజుకూ పార్టీ నాయకుల రాజీనామాలు చేస్తూ పార్టీ వీడుతున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాంను కాదని చిప్పగిరి జెడ్పీటీసీ సభ్యుడు విరుపాక్షిని పార్టీ అధిష్టానం ఆలూరు సమన్వయకర్తగా నియమించడంతో మంత్రి గుమ్మనూర్ జయరాం వర్గీయులు రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. దేవనకొండ జెడ్పీటీసీ సభ్యుడు కిట్టు, ఎంపీటీసీ సభ్యులు మల్లి, చిట్టెమ్మ, శెట్టి, కరివేముల వీరేష్ లు వైఎస్సార్ సీపీకి రాజీనామా చేశారు. ఈసందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ.. 2011 నుంచి వైఎస్సార్ సీపీ కోసం పనిచేశామని, అయితే మంత్రి గుమ్మనూర్ జయరాంను కాదని చిప్పగిరి జెడ్పీటీసీ సభ్యుడు విరుపాక్షికి పార్టీ అధిష్టానం సమన్వయకర్తగా నియమించిందని, పార్టీలో గుమ్మనూర్ జయరాం వర్గీయులపై విరుపాక్షి వివక్ష చూపిస్తున్నారని వారు వాపోయారు. పార్టీ కార్యక్రమాలకు తమను పిలవడం లేదని వారు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన తమకు గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తమకు గుర్తింపు లేకపోవడంతో మనస్తాపానికి గురై, పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం అడుగు జాడల్లో నడుస్తామన్నారు.
Aluru: వైసీపీ నాయకుల రాజీనామా
విరూపాక్షి వర్సెస్ గుమ్మనూరు వర్గం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES