బేతంచెర్ల పట్టణంలోని దుర్గాపేట కాలనీకి చెందిన తిక్క వెంకటేశ్వర్లును డోన్ డివిజన్ ఎస్సీ, ఎస్టీ సెల్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిని ఎస్సీ ఎస్టీ సెల్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు తిక్కవెంకటేశ్వర్లు సహచర మిత్ర బృందంతో మర్యాదపూర్వకంగా మంత్రి స్వగృహంలో కలిసి ఆర్ధికశాఖ మంత్రి బుగ్గనను గజమాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు బుగ్గన నాగ నాగభూషణం రెడ్డి, బేతంచెర్ల నగర పంచాయితీ చైర్మన్ సిహెచ్ చలం రెడ్డి, దుర్గా పేట కాలనీవాసులు వి భాస్కర్, నడ్డి శ్రీనివాసులు, గజ్జి మురళి, సుందర రాజు, రమేష్ , బాల శేఖర్, కోట్ల మధు, ఆర్ శ్రీనివాసులు, అంబాపురం మధు, ఆవుల మధు, గజ్జి మద్దయ్య, మస్సి మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.