Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Gospad: కిరాణా షాప్ యజమాని కూతురుకు జాతీయ ర్యాంక్

Gospad: కిరాణా షాప్ యజమాని కూతురుకు జాతీయ ర్యాంక్

CMA ఆల్ ఇండియా 50వ ర్యాంక్

మండల పరిధిలోని జిల్లెల్ల గ్రామంలో ఒక చిన్న కిరణ్ షాప్ నిర్వహిస్తున్న భూమా సురేష్ కుమార్, లక్ష్మీ దంపతుల కూతురు భూమా నాగసాయి ఆనందితకు బుధవారం దేశ స్థాయిలో విడుదల చేసిన సీఎంఏ(సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ )లో 50 వ ర్యాంక్ (జాతీయ స్థాయిలో) వచ్చినట్లు వారి తల్లిదండ్రులు తెలిపారు. గతంలో మండల కేంద్రంలోని గోస్పాడు ఏపీ ప్రభుత్వ మోడల్ పాఠశాలలో చదివ పదవ తరగతిలో 10/10 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో, అదే కళాశాలలో ఇంటర్ చదివి ఎంఇసి గ్రూపులో 925 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకున్నారన్నారు. ప్రస్తుతం గుంటూరులోని మాస్టర్ మైండ్ కళాశాలలో సీఎంఏ కోచింగ్ తీసుకుని సీఎంఏ ఫలితాలలో జాతీయ స్థాయిలో ర్యాంకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. తమ గ్రామ విద్యార్థినికి జాతీయ ర్యాంక్ రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News