ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త విరుపాక్షి అన్నారు. మండలంలోని బేవినహాల్, శ్రీధర హాల్, కోక్కరచెడు, మల్లికార్జున పల్లి, గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నవరత్నాలు భాగంగా అమ్మ ఒడి, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో అందించాలని లక్ష్యంతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి వాలంటీర్లు ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సకాలంలో అందించడం సీఎం జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమైందని ఆయన తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజా ఆదరణ చూసి టిడిపి నాయకులు ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సంక్షేమ పథకాలు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అర్హతే లక్ష్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన కొనియాడారు. టిడిపి నేత చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు నాయుడుని ప్రజలు నమ్మరని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఉచిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కి 175 స్థానాలు గెలవడం తధ్యమని ఆయన జోష్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆలూరు నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు అండగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోనంకి జనార్దన్ నాయుడు, చింతగుంట సొసైటీ చైర్మన్ శ్రీనివాసులు, నిట్రవట్టి మాజీ ఎంపీటీసీ తిమ్మప్ప, వైఎస్ ఎంపీపీ నాగేష్, సచివాలయ కన్వీనర్ రంజిత్, వైఎస్సార్ సీపీ నాయకులు తిప్పరెడ్డి, నారాయణ, దిబ్బలింగ, బసవరాజు, తదితరులు పాల్గొన్నారు.