Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: ప్రజా పోలీసు ఎస్ఐ రమణకు వీడ్కోలు

Nandikotkuru: ప్రజా పోలీసు ఎస్ఐ రమణకు వీడ్కోలు

నందికొట్కూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తించిన మంగళవారం ఎస్ఐ ఎన్వి రమణ ప్యాపిలి రాచర్ల పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారన్న సమాచారం తెలుసుకున్న పట్టణ ప్రజలు, ఆటో కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు, యువకులు ఆందోళన గురయ్యారు. పోలీస్ సేవలు ప్రజల మనిషిగా విధులు నిర్వహించిన ఎస్సై ఎన్వి రమణ బదిలీ పలువురిని కలత చెందేలా చేసింది. ఆయన చేపట్టిన రెండు సంవత్సరాల కాలంలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కనపరచడంలో సీసీ కెమెరాల ఏర్పాటు, అసాంఘిక కార్యక్రమాలపై తనదైన శైలి లో ప్రత్యేక ముద్ర చాటుకోవడం, స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరప్రధంగా నడుచుకోవడం, చిన్న పెద్ద తేడా లేకుండా, అన్ని వర్గాల ప్రజలను సమన్వయంతో చూస్తూ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించడంతో పట్టణ ప్రజల్లో ఎస్సై ఎన్వి రమణ ఆదరణ అభిమానాన్ని పొందగలిగారు. ఊహించని ఎస్ఐ రమణ బదిలీ సమాచారాన్ని తెలుసుకున్న పట్టణ ప్రజలు, ప్రజా సంఘాలు యువకులు, పాత్రికేయ మిత్రులు, మహిళా సంఘాలు ఆత్మీయ అనుబంధంతో మీ సేవలు మరువలేని అంటూ పట్టణంలో ఎస్సై ఎన్వి రమణను పూలమాల దృశ్యాలతో సన్మానించి మంగళవారం రాత్రి స్టేషన్ నుంచి పటేల్ సెంటర్ వరకు బాణాసంచా పేలుస్తూ ఊరేగింపు నిర్వహించి ఘనమైన వీడ్కోలు పలికారు.

- Advertisement -

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సై ఎన్వి రమణకు ఘన సన్మానం:

సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రఘు రామ్మూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీను వాసులు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న పట్టణ ఎస్సై ఎన్.వి.రమణను శాలువ పూలమాలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురామమూర్తి మాట్లాడుతూ ఎస్ఐగా విదుల నిర్వహణలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ప్రజల మెప్పు పొందిన పోలీస్ అధికారిగా నిలిచిపోయారన్నారు. నిజమైన ప్రజా పోలీసుగా పట్టణ ప్రజలకు సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మహానంది, దినేష్, సురేంద్ర ఆటో కార్మికులు పాల్గొన్నారు.

ప్రజల మనసులో నిలిచిపోయారు :నాగేశ్వరరావు.సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు

పట్టణ ఎస్ఐగా ఎన్వి రమణ పదవి బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల ప్రజలను సమన్యాయంతో చట్టబద్ధంగా సేవలందించి ప్రజల మన్నలను ఎస్సై ఎన్వి రమణ అని కొనియాడారు. స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారుల పట్ల గౌరప్రధంగా మర్యాదనిస్తూ ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయుటలో ఆయన వైఖరి అభినందనీయమన్నారు. పట్టణంలో పలు సమస్యలపై ప్రత్యేక దృష్టి కనబరుస్తూ అనతి కాలంలోనే పట్టణ ప్రజల భద్రత కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా దొంగతనాల నివారణకు ఎంతో కృషి చేస్తారని చెప్పుకొచ్చారు. ప్రజల సేవ అంటే అధికార జూలం ప్రదర్శించడం కాదని నిస్వార్థ విధుల నిర్వహణ మాత్రమే నని చాటిన ఎస్సై ఎన్వి రమణ ఆయన పట్టణ పోలీస్ స్టేషన్ నుండి బదిలీ కావడం చాలా బాధాకరమన్నారు. ఆయన చేసిన సేవలు ప్రజల్లో గుర్తుండి పోయేలా ఉన్నాయని ప్రజల ఆదరణ పొందిన ప్రజా పోలీస్ గా నిలిచారని, ఆయనను పలువురు ఆదర్శంగా తీసుకునే మసులు కొని విధులు నిర్వహించిన తీరుపై ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఫకీర్ సాహెబ్, భాస్కర్ రెడ్డి, నాగన్న, ఎస్ఎఫ్ఐ నాయకులు డక్క కుమార్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మాకెంతో మేలు చేశావయ్యా: షికారి పేట ప్రజలు
ప్రజలకు సేవ చేయడానికి ఎంతో మంది పోలీస్ అధికారులు వస్తూ పోతూ ఉంటారని కానీ వారి ఏనాడు మా క్షేమం కోసం కృషి చేయలేదని పేర్కొన్నారు. కానీ ఎస్సై ఎన్వి రమణ రెండు సంవత్సరాల కాలంలో మాలో మా సంక్షేమం కోసం పిల్లల భవిష్యత్తు కోసం అవగాహన కల్పిస్తూ మాకు ఎంతో ధైర్యం కల్పించారన్నారు. అలాంటి గొప్ప మనసున్న ఎస్సై రమణ బదిలీపై వెళ్లడం మాకు చాలా బాధాకరమని, మీ మేలు మరువలేమంటూ ఎస్ఐ పట్ల సికారి పేట ప్రజలు పూలమాలలు వేసి దృశ్యాలువ తో ఘనంగా సన్మానించి తమ ఆత్మీయ అభిమానాన్ని చాటుకున్నారు.కార్యక్రమంలో షికారీ పేట ప్రజలు పాల్గొన్నారు.

అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన ఎస్ఐ పట్టణ ఎస్సై ఎన్వి రమణ మంచితనానికి మారుపేరుగా, ప్రజల పెట్ల బాధ్యత కలిగిన పోలీసు అధికారిగా, చిరునవ్వుతో పలకరించడం, సమస్యలనుక్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడం, స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదార్ల పట్ల గౌరప్రధంగా మల్చుకోవడం ఇవే ఆయన వివిధ నిర్వహణలో ప్రజలకు అందించడంపై ప్రజల్లో, యువకులలో ప్రజాసంఘాల నాయకుల ఆదరభిమానాలు పొందడంలో సఫలీకృతుడై అందరి మన్నలను పొందడానికి కారణమయ్యాయి. పట్టణ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ ఎన్వి రమణ శాంతిభద్రతల పరిరక్షణ కోసం పలు కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబడటంతో సీసీ కెమెరాలు ఏర్పాటు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నాడుసారా తయారీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి, సారించారు.

ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు:ఎస్ ఐ ఎన్ వి రమణ

నందికొట్కూరు పట్టణ ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల కాలంలో చట్టబద్ధంగా ఉన్నతాధికారుల సూచనలతో ప్రజలకు ఎంతో సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని ఎస్ఐ ఎన్ వి.రమణ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు అత్యంత సౌమ్యులని పోలీసు వారి పట్ల వారి ఆదరణ అభిమానం మరువలేనివాని చెప్పుకొచ్చారు. తన విధుల నిర్వహణలో సహకరించిన ప్రజలకు ప్రజాసంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News