Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirupathi: సహాయక చర్యలు ముమ్మరం

Tirupathi: సహాయక చర్యలు ముమ్మరం

24/7 క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న ప్రత్యేక పోలీస్ బృందాలు

మిచౌంగ్ తుఫాన్ వలన జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లి ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలైన నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట, నెల్లూరు-చెన్నై జాతీయ రహదారి పరిసరాల లోతట్టు ప్రాంతాల యందు క్షేత్రస్థాయిలో పర్యటించి చేస్తున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.

- Advertisement -

వాకాడు బాలి రెడ్డి పాలెం ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షించారు వీరితోపాటు గూడూరు ఆర్డీవో కూడా పాల్గొన్నారు

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఇతర శాఖల అధికారులతొ సమన్వయం చేసుకొని సహాయక చర్యలను చేపట్టాలన్నారు. వరద ముంపు వలన జల దిగ్భంధనం అయిన లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించడంలో పోలీసులు ఇతర శాఖల సిబ్బంది ని సమన్వయ పరుచుకుంటూ సమిష్టిగా పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పునరావాస కేంద్రాలకు తరలించి, తగిన సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు.

భీకరమైన ఈదురుగాలులకు కుంభవృష్టి తోడవడంతో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు రహదారులపై, జనావాసాలపై నేలకొరిగాయని. అందువలన గూడూరు, నాయుడుపేట మండలాలలో జనజీవనం కొంతమేర ఇబ్బందికర వాతావరణం ఏర్పడిందని అయితే ఈ రోజు ఉదయం నుండి వర్షం తగ్గడంతో సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ శిథిలాలను చెట్లను తొలగిస్తూ, ప్రజా జీవనానికి అవసరమయ్యే సాధారణ పరిస్థితుల కల్పన కోసం ముమ్మర కృషి చేస్తున్నామన్నారు.

ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలు దయచేసి తమ ఇళ్ల నుండి బయటకు రావద్దని కోరారు. అదే సమయంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి (వృద్ధులు, చిన్న పిల్లలు) వాలంటీర్లు, అధికారులే కాకుండా స్థానిక యువకులు కూడా స్వయంగా ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించి, తమ తోటి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విజ్ఞప్తి చేశారు.

నెల్లూరు-చెన్నై జాతీయ రహదారి జలమయమవడంతో అక్కడికక్కడ దారి మళ్లింపు చర్యలను చేపట్టి కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయిన ట్రాఫిక్ జామ్ ను క్రమబద్ధీకరించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

మిచౌంగ్ తుఫాన్ లాంటి విపత్కర సమయంలో సమాజమే కుటుంబంగా ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి నిత్యం ప్రజల సంరక్షనే ధ్యేయంగా అహర్నిశలు ప్రజాసేవలో నిమగ్నమైన జిల్లా పోలీసులు విశేష సేవలు అందిస్తున్నారని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను, సిబ్బందిని కొనియాడారు.

ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆపత్కాలం ఎదురైనా వెంటనే డయల్ 100, 112, 80999 99977 నెంబర్లకు కాల్ చేసి సమాచారం అందించిన తక్షణమే పోలీసులు స్పందించి సహాయమందిస్తారని జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News