Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Increasing foreign students in AP: పెరుగుతున్న విదేశీ విద్యార్థులు

Increasing foreign students in AP: పెరుగుతున్న విదేశీ విద్యార్థులు

’స్టడీ ఇన్ ఇండియా‘ ప్రోగ్రామ్ కింద ఈ విద్యార్థులకు అనేక రాయితీలు, సౌకర్యాలు

విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎనిమిదవ స్థానంలో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎక్కువ సంఖ్యలో అంతర్జాతీయ విద్యార్థులు చదువుకుంటున్నది కర్ణాటకలోనని ఉన్నత విద్యా శాఖ తెలిపింది. కర్ణాటకలో 8,137, పంజాబ్ లో 6,557, మహారాష్ట్రలో 4,912, ఉత్తర ప్రదేశ్ లో
4,654, తమిళనాడులో 3,685, ఢిల్లీలో 2,809, గుజరాత్ లో 2,646, ఆంధ్రప్రదేశ్ లో 2,385, ఒడిశాలో 2,180 మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ మొత్తం 2,385 మంది విద్యార్థుల్లో 1,530 మంది, అంటే 65 శాతం మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్నారు. రాష్ట్రంలో 26 మంది అంతర్జాతీయ విద్యార్థులు పిహెచ్.డి చేస్తున్నారు.

- Advertisement -

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 2022-23 విద్యా సంవత్సరంలో మొదటిసారిగా వెయ్యి దాటింది. ఎక్కువ మంది విద్యార్థులు ఆఫ్రికా దేశాల నుంచి, మధ్యప్రాచ్యం, సార్క్ దేశాలకు చెందిన విద్యార్థులే. విశాఖపట్నంలోని గీతమ్ విశ్వ విద్యాలయంలో సుమారు 400 మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యార్థులంతా సుమారు 45 దేశాల నుంచి వచ్చినవారు. కేంద్ర విద్యాశాఖ ప్రారంభించిన ’స్టడీ ఇన్ ఇండియా‘ ప్రోగ్రామ్ కింద ఈ విద్యార్థులకు అనేక రాయితీలు, సౌకర్యాలు లభిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో భోజన వసతి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతోంది.

ఉన్నత విద్యను అభ్యసించడానికి భారతదేశంలో తమ పేర్లను నమోదు చేసుకున్న వారి సంఖ్య 48 వేల పైచిలుకే. వీరంతా ప్రపంచవ్యాప్తంగా సుమారు 163 దేశాల నుంచి ఇక్కడకు ఉన్నత విద్య కోసం రావడం జరిగింది. నేపాల్ నుంచి అతి ఎక్కువగా 28.26 శాతం, అఫ్ఘానిస్థాన్ నుంచి 8.49 శాతం, బంగ్లాదేశ్ నుంచి 5.72 శాతం, భూటాన్ నుంచి 3.8 శాతం, సూడాన్ నుంచి 3.33 శాతం, అమెరికా నుంచి 5.12 శాతం ఇక్కడకు రావడం జరిగింది. ప్రపంచంలోని ఉన్నత స్థాయి 10 దేశాల నుంచి 67.48 శాతం విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యనభ్యసిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News