Wednesday, March 26, 2025
Homeఆంధ్రప్రదేశ్Evaluation: ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా!

Evaluation: ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా!

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు మార్చి 20 గురువారంతో ముగిసాయి. బుధవారం నుంచే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం( Inter Answer Paper Evaluation) ప్రారంభమై కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డు మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరైన అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 సెంటర్లలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 19 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ మూల్యాంకన విధుల్లో ప్రతి సెంటర్ లో 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ బోర్డు బిఐఈ యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వేలిముద్రలు లేదా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఈ యాప్ లో హాజరు చేసుకోవచ్చు.

ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిన తర్వాత మరో 10 రోజుల్లో మార్కులను ఎంటర్ చేసే ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ విధంగా చూసుకుంటే ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News