ఏపీలో పదో తరగతి షెడ్యూల్ విడుదలైన కాసేపటికే ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్(Inter Exams Schedule) విడుదలైంది. ఈ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఎక్స్ వేదికగా విడుదల చేశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఫిబ్రవరి 3న ఎన్విరాన్ మెంటల్ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్: మార్చి 1న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 4న ఇంగ్లీష్, మార్చి 6న మ్యాథ్స్, బొటనీ, సివిక్స్, మార్చి 8న మ్యాథ్స్ బీ, జువాలజీ, హిస్టరీ, మార్చి 11న ఫిజిక్స్, ఎకానమీ, 13న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్, 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జీ కోర్సు మ్యాథ్స్, 19న మోడర్న్ లాంగ్వేజీ, జియోగ్రఫీ పరీక్షలు జరుగుతాయి.
రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్: మార్చి 2న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 5న ఇంగ్లీష్, మార్చి 7న మ్యాథ్స్, బొటనీ, సివిక్స్, మార్చి 10న మ్యాథ్స్ బీ, జువాలజీ, హిస్టరీ, 12న ఫిజిక్స్, ఎకానమీ, 15న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్, 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జీ కోర్సు మ్యాథ్స్, 20న మోడర్న్ లాంగ్వేజీ, జియోగ్రఫీ పరీక్షలు జరుగుతాయి.