ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమయినాయి. మొదటి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఆదోని పట్టణంలో ఆర్ట్స్ కళాశాలలో ఎ,బి, ప్రభుత్వ గర్ల్స్ కళాశాల, అక్షరశ్రీ కళాశాల, బాలాజీ కళాశాల, నారాయణ కళాశాల, సాయి కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. ఏడు సెంటర్ లలో కలిపి మొత్తం విద్యార్థులు 2589 మంది కాగా 82 మంది పరీక్షకు గైర్హాజరు అయ్యారు.ఆర్ట్స్ కళాశాలలోని ఎ సెంటర్ లో 15 ,బి సెంటర్ లో 9, బాలాజీ కళాశాలలో 9, సాయి కళాశాలలో 12, అక్షర శ్రీ కళాశాల లో 15, నారాయణ కళాశాలలో 13, ప్రభుత్వ బాలికల కళాశాల లో 9 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఆయా కళాశాలల సూపరింటెండెంట్ లు తెలియజేశారు. పరీక్ష కేంద్రాల దగ్గర పోలీస్ బందోబస్తు, మెడికల్ సిబ్బందిని నియమించారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని ముందుగానే బోర్డ్ అధికారులు తెలియజేయడంతో విద్యార్థులు సకాలంలో సెంటర్ లకు చేరుకున్నారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
Inter exams start: ఇంటర్ పరీక్షలు ప్రారంభం
2589 విద్యార్థులకు గాను 82 మంది విద్యార్థులు గైర్హాజరు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES