ఏపీలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు(IPS Transfers) బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. 2021 బ్యాచ్‌కు చెందిన నవ జ్యోతి మిశ్రాకు చింతపల్లి ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. 2022 బ్యాచ్‌కు చెందిన మందా జావళి అల్ఫోన్‌ను నంద్యాల ఏఎస్పీగా నియమించారు. రాజంపేట ఏఎస్పీగా 2022 బ్యాచ్‌కు చెందిన మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే, కాకినాడ ఏఎస్పీగా 2022 బ్యాచ్‌కు చెందిన దేవరాజ్ మనీష్, తాడిపత్రి ఏఎస్పీగా 2022 బ్యాచ్‌కు చెందిన రోహిత్ కుమార్ చౌదరిని నియమించారు.
IPS Transfers: ఏపీలో పలువురు ఐపీఎస్‌లు బదిలీలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES