ఏపీ రాజధాని అమరాతి(Amaravati) పనులు పునఃప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. దీంతో రాజధాని ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. కాసేపట్లో ప్రధాని మోదీ అమరావతి పున:నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో చేరుకుంటున్న ప్రముఖులతో పాటు సామాన్యుల రాకతో సరికొత్త కళ సంతరించుకుంది. ఈ క్రమంలో సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ శిల్పాలు(Iron Scrap) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
కాలచక్రం, ఎన్‌టీఆర్, బుద్ధుడు, సింహం, ప్రధాని మోదీ విగ్రహాలతో పాటు మేక్ ఇన్ ఇండియా లోగో ఆకట్టుకుంటున్నాయి. ఇక తెలుగులో అమరావతి అక్షరాలు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా అందరీ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ శిల్పాలను ఇనుము స్క్రాప్‌తో శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తీర్చిదిద్దారు.
