వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి(YS Bharathi)పై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పోలీసులను బట్టలు ఊడదీస్తానంటూ జగన్ హెచ్చరించిన వ్యాఖ్యలపై కౌంటర్‌గా చాలా జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
- Advertisement -
మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నేతలను ఆదేశించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుంటూరు పోలీసులు కిరణ్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో అతడు క్షమాపణలు చెప్పాడు.