Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan 2 day tour in Kadapa: కడపలో రెండు రోజుల టూర్లో సీఎం...

Jagan 2 day tour in Kadapa: కడపలో రెండు రోజుల టూర్లో సీఎం జగన్

గౌస్‌ మహ్మద్‌ రఫీ ఇంట్లోని వివాహ వేడుకకు హాజరు

కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కడప విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది.

- Advertisement -

ఈ నెల 9,10 తేదీలలో రాయచోటి, పులివెందుల, ఇడుపులపాయలలో పలు కార్యక్రమాలల్లో పాల్గొనే నిమిత్తం.. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప విమానాశ్రయం చేరుకున్నారు.

ఈ సందర్భంగా.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, డిఐజి యస్. సెంతిల్ కుమార్,ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, జేసీ గణేష్ కుమార్, నగరపాలక సంస్థ కార్పోరేషన్ కమీషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, కడప ఆర్డీవో మధుసూదన్ లు ముఖ్యమంత్రికి.. పుష్ప గుచ్చం అందజేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు.

వీరితో పాటు ఎమ్మెల్సీలు రామచంద్రా రెడ్డి, సి రామచంద్రయ్య, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రా రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, కడప మేయర్ సురేష్ బాబు, ఆర్టీసీ మాజీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి,వైఎస్సార్సీపీ నాయకులు మాసిమ వెంకట సుబ్బారెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో వున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆప్యాయంగా అందరిని పేరుపేరున పలకరించారు.

అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయచోటిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హెలికాప్టర్లో బయలు దేరి వెళ్లారు.

రాయచోటిలో మాజీ ఎంపీపీ గౌస్‌ మహ్మద్‌ రఫీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకకు హాజరైన సీఎం వైఎస్‌ జగన్‌, రాజధాని ఫంక్షన్‌ హాల్లో జరిగిన వేడుకలో వరుడు మహ్మద్‌ నిహాజ్, వధువు నూర్‌ ఈ చష్మిలను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ షరీఫ్, ఎయిర్ పోర్ట్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి ఆలయం, శిల్పారామం, ఏపీ కార్ల్‌ ప్రాంగణంలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కళాశాలలు, స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సెంట్రల్‌ టెస్టింగ్‌ లేబరేటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ ల్యాబ్‌ వంటి ప్రారంభోత్సవాలతో జగన్ బిజీ షెడ్యూల్ సాగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News