Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Telangana: తెలంగాణ ప్రజలకు జగన్, షర్మిల శుభాకాంక్షలు

Telangana: తెలంగాణ ప్రజలకు జగన్, షర్మిల శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సోదర, సోదరీమణులందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కూడా ఎక్స్ వేదికగా శుభకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టారు. “తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు అందరం ఒక్కటే. రాష్ట్రంలో నియంత పాలనకు, బానిసత్వానికి స్వస్తి చెప్పి, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన అందిస్తూ, హస్తమే అభయహస్తంగా ‘తెలంగాణ రైజింగ్’ నినాదంతో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతూ, అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్న గారికి,ఇతర కేబినెట్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు ప్రత్యేక శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad