శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు సీఎం వైఎస్ జగన్. తిరుపతి తాజ్ హోటల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో వధువు నిరీష, వరుడు సాగర్‌లకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పలువురు రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.

