Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru Jagan bus Yatra: కురుక్షేత్రంకు మేం సిద్ధం మీరు సిద్దామా?

Emmiganuru Jagan bus Yatra: కురుక్షేత్రంకు మేం సిద్ధం మీరు సిద్దామా?

చంద్రబాబు,మోడీ , దత్త పుత్రుడును తరిమి కొట్టండి

రాష్ట్రంలో జరిగే కురుక్షేత్రంలో మేమంతా సిద్దం మీరు సిద్దమా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కర్నూలు ఎమ్మిగనూరు పట్టణం వీవర్స్ కాలని గ్రౌండ్ లో ఎమ్మిగనూరు వైసిపి అభ్యర్థి బుట్టా రేణుక అధ్వర్యంలో జరిగిన మేమంతా సిద్దం బహిరంగ సభ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్ర బాబు నాయుడు,మోడీ , దత్త పుత్రుడు ఏకమై నన్ను ఓడించేందుకు సిద్దం అయ్యారు.

- Advertisement -

వారి కుట్రలను ప్రజలు సాగనివ్వరు. వైసిపి ప్రభుత్వం మంచి చేసింది అని భావిస్తేనే మాకు ఓటు వేయండి. ప్రతి ఇంటిలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించాం. విద్య రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని విస్మరించిన చంద్రబాబు ను ఓటు వేస్తారా? అని అన్నారు. 58 నెలలలో అనేక మంది కు అండగా నిలిచాం.పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం తో పాటు సీబీఎస్సీ సిలబస్ ను కూడా ప్రవేశ పెడతాం. రైతుల,డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన చంద్ర బాబును నమ్మి మోసపోవద్దు. పెత్తందార్లు, పేదలకు జరుగుతున్న పోటీ లోపేదలదే విజయం. రైతుల వ్యతిరేకుల అనుకూల పార్టీలే మధ్య యుద్ధం జరుగుతుంది.

ఈ యుద్ధంలో రైతుల అనుకూల వైసిపి విజయం సాధిస్తుంది. ప్రతిపక్షాలు మోసాలు మాయమాటలు ను నమ్ముకున్నాయి.వైసిపి ఇచ్చిన మాట కు కట్టుబడి ఉంది.బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక న్యాయం చేసిన ఘనత వైసిపి దే.58 ఏళ్లలో 2.70 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారుల అకౌంట్స్ లో వేశాం. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం.ప్రభుత్వ పాఠశాలల లో ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పిన చంద్రబాబు ను నమ్మరాదు. బిసి లు తోక కత్తిరిస్తామని , ఎస్సి కులంలో ఎవరైన పుడతారా అని అవమానించిన చంద్రబాబు తోకను కత్తిరించండి. చంద్రబాబుకు మన రాష్ట్రంలో నా అనే వాళ్ళు ఎవరు లేరని జగన్ నిప్పులు చెరిగారు.

హైదరాబాద్ లో దత్త పుత్రుడు ఉన్నాడని, ఆయన పేరు చెబితే ఒక్క మంచి పథకం కూడా గుర్తుకు రాదని జగన్ అన్నారు. ఇటువంటి వారికి ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షుడు, ఎం పి అభ్యర్థి బీవై రామయ్య అభ్యర్థులు , ఎమ్మెల్యే లు చెన్నకేశవ రెడ్డి, బుట్టా రేణుక,వై బాలనాగిరెడ్డి,వై సాయి ప్రసాద్ రెడ్డి, శ్రేదేవమ్మ, ఆఫీజ్ ఖాన్, విరుపాక్షి , సతీష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News