Friday, September 27, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan cancels Tirumala tour: తిరుమ‌ల ప‌ర్య‌టనను ర‌ద్దు చేసుకున్న జ‌గ‌న్‌

Jagan cancels Tirumala tour: తిరుమ‌ల ప‌ర్య‌టనను ర‌ద్దు చేసుకున్న జ‌గ‌న్‌

నా మతం మానవత్వం..డిక్లరేషన్‌లో రాసుకోండి

నా కులం, మతం ఏంటో ప్రజలందరికి తెలుసు. నా మతం మానవత్వం. నాలుగు గోడల మధ్య నేను బైబిల్‌ చదువుతా. బయటకు వెళ్తే అన్ని మతాలను గౌరవిస్తా. హిందుమత ఆచారాలను పాటిస్తా. ఇస్లాం, సిక్కు మత సంప్రదాయాలను గౌరవిస్తా. నా మతం ఏమిటని అడుగుతున్నారు. నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి….అని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

టీడీడీ నోటీసు ఇవ్వ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. త‌న తిరుమ‌ల ప్ర‌యాణాన్ని ర‌ద్దు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శుక్రవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… చంద్రబాబు పాపాలు ప్రజలపై పడకుండా వైసీపీ నేతలు మీ ఊళ్లలో ప్రత్యేక పూజలు చేయండ‌ని ఆయ‌న‌ పిలుపునిచ్చారు. 100 రోజులపాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలే. అడ్డగోలుగా ఆలయ పవిత్రతను దెబ్బతీశారు.

ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది. దేవుడి దర్శనానికి వెళ్దామంటే నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అరెస్ట్‌ చేస్తామంటున్నారు. ఇలా అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. మా పార్టీ నేతలకు నోటీసులిచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసా అని ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమిలోని బాబు లడ్డూను విశిష్టతను కించపరుస్తుంటే బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదు. మతం పేరుతో రాజకీయాలు చేయడం దుర్మార్గం. చంద్రబాబు చెప్పు చేతల్లో ఉండే అధికారులతో సిట్‌ వేశారు. రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారు… అని మాజీ సీఎం జ‌గ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. వేలాది మంది పోలీసులను మోహరించారు. లడ్డూ వివాదంలో డైవర్షన్‌ కోసమే ఇవన్నీ చేస్తున్నారు. లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ బాబు అడ్డంగా దొరికిపోయారు. రాజకీయ దుర్భుద్ధితోనే లడ్డూ విశిష్టతను దెబ్బ తీశారు. జంతువుల కొవ్వు కలిపినట్లు దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టాడు. జంతువుల కొవ్వుతో ప్రసాదాలు తయారు చేశారని అబద్ధాలు చెబుతున్నారన్న జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆధారాలు చూపిస్తామన్నారు. కల్తీ ప్రసాదాలను భక్తులు తిన్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఆరు నెలకొకసారి నెయ్యి కొనుగోలు టెండర్లు జరుగుతాయి. ఎల్‌1 ఎవరొచ్చారో వారికే టెండర్లు ఇస్తారు. దశాబ్ధాలుగా ఈ ప్రక్రియనే జరుగుతూ ఉంది. ప్రతి ట్యాంకర్‌ ఎన్‌ఏబీఎల్‌ సర్టిఫికెట్‌ తేవాలి. ట్యాంకర్‌ వచ్చాక కూడా టీటీడీ 3 టెస్టులు చేస్తుంది. ఒక్క టెస్ట్‌ ఫెయిల్‌ అయినా ట్యాంకర్‌ను వెనక్కి పంపుతారు. బాబు హయాంలో కూడా 15 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపారు. మా ప్ర‌భుత్వ హయాంలో కూడా 18 సార్లు వెనక్కి పంపాం. తిరుమలలో ఇంత గొప్ప వ్యవస్థ ఉంది… అని వైఎస్‌ జగన్‌ వివరించారు. జూలై 6, 12 తేదీల్లో నాలుగు ట్యాంకర్లు వచ్చాయి. ఆ నాలుగు ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్‌ అయ్యాయి. టెస్టులు ఫెయిల్‌ అయిన 4 ట్యాంకర్లను వెనక్కి పంపారు. టెస్ట్‌లు ఫెయిల్‌ అయితే మైసూర్‌ ల్యాబ్‌కు పంపుతారు.. కానీ మొదటిసారిగా ఈ శాంపిల్స్‌ను గుజరాత్‌కు పంపారు. ట్యాంకర్లను వెనక్కి పంపి సదరు కంపెనీకి నోటీసులు ఇచ్చారు. 2 నెలల తర్వాత చంద్రబాబు యానిమల్‌ ఫ్యాట్‌ కలిసిందన్నారు. ఆ మరుసటి రోజే టీడీపీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను బయటపెట్టారు….అని వైఎస్‌ జగన్ పేర్కొన్నారు. కల్తీ నెయ్యి ప్రసాదాలకు వాడలేదని ఈ నెల 20న ఈవో చెప్పారు. ఈ నెల 22న ఈవో ఇచ్చిన నివేదికలో కూడా ట్యాంకర్ల వెనక్కి పంపినట్లు ఉంది. అయిన సరే బాబు కల్తీ నెయ్యి కలిసిందని అబద్ధాలు చెప్పారు. అబద్ధాలతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. భక్తుల్లో అనుమానపు బీజాలు వేయడం దుర్మార్గం కాదా?రాజకీయ స్వార్థం కోసం లడ్డూ ప్రతిష్టను దిగజారుస్తున్నావ్‌. చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి… అంటూ వైఎస్‌ జగన్ వివ‌రించారు.టీటీడీ బోర్డు సభ్యులు ప్రముఖులు.. పారదర్శకంగా పనిచేస్తారని, టీటీడీ సభ్యులుగా తీసుకోవాలని కేంద్రం, సీఎంలు సిఫారసు చేస్తారని వ్యాఖ్యానించారు. రాజకీయ స్వార్థం కోసం శ్రీవారి ప్రసాదాల విశిష్టతను దెబ్బతీస్తున్నారని, తిరుమల ప్రసాదాలపై అనుమానాలు రేకెత్తించడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. వివాదాన్ని పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు డిక్లరేషన్ అంటున్నారన్న జగన్ తన కులం, మతం గురించి ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. శ్రీవారి దర్శనం చేసుకున్నాకే నా పాదయాత్ర ప్రారంభించానని, పాదయాత్ర పూర్తయ్యాక కూడా నడిచివెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని జగన్‌ అన్నారు. గతంలో అనేకసార్లు తిరుమల వెళ్లాననే విషయం అందరికీ తెలుసు.. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ఐదుసార్లు వస్త్రాలు సమర్పించా అని జగన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News