Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan: కరువు-చంద్రబాబు ఫ్రెండ్స్‌..యుద్ధం జరుగుతోంది

Jagan: కరువు-చంద్రబాబు ఫ్రెండ్స్‌..యుద్ధం జరుగుతోంది

తెనాలిలో జరిగిన రైతు బంధు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ తన ప్రసంగంలో ప్రతిపక్ష టీడీపీపై నిప్పులు చెరిగారు. కరువు-చంద్రబాబు ఫ్రెండ్స్‌ అన్న జగన్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యుద్ధం జరుగుతోందని పరుషంగా వ్యాఖ్యానించటం విశేషం. రైతులను వంచించిన చంద్రబాబు ఒకవైపున ఉంటే రైతన్నకు అండగా ఉంటున్న ప్రభుత్వం మరో వైపున ఉందంటూ ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నది క్యాస్ట్ వార్ కాదని అదంతా క్లాస్ వారని పేదవారు ఓవైపు పెత్తందార్లు ఓవైపు ఉన్నట్టు సీఎం జగన్ పేర్కొన్నారు.

- Advertisement -

వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో తాను ఇచ్చిన వాగ్దానాలన్నీ 98.5 శాతం పూర్తి చేసినట్టు చెప్పుకున్న జగన్.. ఈ విషయాన్ని తాను గర్వంగా వెల్లడిస్తున్నట్టు చెప్పారు. ఈ సర్కారును ఆశీర్వదించాలని ఆయన పదేపదే విజ్ఞప్తి చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

బాబు, దత్తపుత్రుడికి ఛాలెంజ్

చంద్రబాబుకు, దత్తపుత్రుడికి సవాల్‌ విసురుతున్నా అన్న జగన్ చంద్రబాబుకు కానీ, దత్తపుత్రుడికి ధైర్యం ఉందా అని నిలదీశారు. 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి, గెలిచే ధైర్యం మీకు ఉందా ? అని సవాల్‌ విసిరారు. చంద్రబాబు, పవన్ కు ఆ ధైర్యం లేదని దీనికి కారణం ఏ రోజూ వాళ్ల జీవితాల్లో వాళ్లు ప్రజలకు చేసిన మంచి లేదని సీఎం తేల్చి చెప్పారు. మీ బిడ్డకు నాకు ఆ ధైర్యం ఉంది, కారణం మంచి చేశాం కాబట్టి ఆ మంచి చెప్పుకుని మీ బిడ్డ మళ్లీ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం, ధైర్యం ఉందని జగన్ ప్రసంగం సాగింది.

కాగా జగన్ తెనాలి పర్యటనలో ఆయన అద్భుతమైన స్వాగతం లభించింది. జగన్ ను చూసేందుకు ప్రజలు ఎగబడగా, సభకు కూడా భారీగా జనం హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News