HomeTop StoriesJagan: 'ఆక్వా ఫీడ్‌ ధరల విషయంలో కంపెనీలతో చంద్రబాబు కుమ్మక్కు'

Jagan: ‘ఆక్వా ఫీడ్‌ ధరల విషయంలో కంపెనీలతో చంద్రబాబు కుమ్మక్కు’

EX CM Jagan fire on CBN: ఆక్వా రైతుల విషయంలో సీఎం చంద్రబాబుపై ఎక్స్‌ వేదికగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో దోపిడీకి ఏ రంగం మినహాయింపు కాదని ఎద్దేవా చేశారు. ఆక్వా ఫీడ్‌ ధరల విషయంలో కంపెనీలతో ముఖ్యమంత్రి కుమ్మక్కయ్యారని.. సీఎం ఛైర్మన్‌గా ఉన్న APSADA అంగీకారం లేకుండా రేట్లు ఎలా పెంచారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం కంపెనీలకు ఎలా వచ్చిందని మండిపడ్డారు. ఆక్వా ఫీడ్‌ కంపెనీలు టీడీపీ సానుభూతిపరులవే అని వ్యాఖ్యానించారు. కమీషన్ల కోసం కంపెనీలతో లాలూచీపడ్డారని.. అందుకే వారు రేట్లు పెంచుతున్నా చంద్రబాబు సైలెంటుగా ఉన్నారని జగన్‌ ఆరోపించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-comments-on-neet-paper-leak/

‘చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు ఆక్వా రైతులుకూడా చితికిపోయారు. సిండికేట్‌ అవుతున్న కంపెనీల నుంచి, దళారుల నుంచి రైతులను రక్షించడానికి మా ప్రభుత్వ హయాంలో చట్టాన్ని తీసుకు వచ్చి, ఏకంగా ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా APSADA అనే రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేశాం. సీడ్‌, ఫీడ్‌ క్వాలిటీ ప్రమాణాలు సహా, వాటి రేట్ల నియంత్రణ దగ్గరనుంచి ఆక్వా ఉత్పత్తులకు ధరలను నిర్ణయించే బాధ్యతను కూడా మా ప్రభుత్వం తీసుకుంది. యూనిట్‌ కరెంటును కేవలం రూ.1.50కే వారికి అందిస్తూ అన్నిరకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంది. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిర్వీర్యం చేసి ఆ రైతులను రోడ్డున పడేశారు. మొదటి ఏడాది ఆక్వా ఉత్పత్తుల రేట్లు పడిపోయి రైతులు నష్టపోతున్నా వారిని ఆదుకోవాలన్న బాధ్యతను విస్మరించారు. ఇప్పుడు ఫీడు రేట్లు పెంచి చేస్తున్న దోపిడీకి వత్తాసు పలుకుతున్నారు. ఇది రైతులకు మీరు చేస్తున్న అన్యాయం కాదా?’- మాజీ సీఎం జగన్‌

Also Read: https://teluguprabha.net/telangana/acb-court-summons-former-minister-ktr-in-formula-e-car-race/

ఆక్వా ఫీడు రేట్లు పెంపు ధరలను పూర్తిగా ఉపసంహరింపచేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే రైతులతో కలిపి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News