Buddha Fire On Jagan Tour : ఆంధ్రప్రదేశ్ లో పంటపొలాలను మొంథా తుఫాన్ (Cyclone Montha) తీవ్ర దెబ్బ తీసింది. 25 జిల్లాల్లో ఈ తుఫాను బీభత్సం సృష్టించింది. 15 లక్షల ఎకరాల్లో పంటలు, 1.38 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రైతులతో మాట్లాడి, నష్టం అంచనా చేయాలని, పరిహారాలు అందించాలని సూచించారు. అయితే ఈ పర్యటనపై స్పందించిన TDP నేత బుద్దా వెంకన్న జగన్ పై విమర్శలు గుప్పించారు. “ఇది రైతు పరామర్శ కాదు, ఫోటోల దండయాత్ర. రైతులు ఓట్లు వేయలేదనే అక్కసుతో వారి పరిస్థితి చూసి ఆనందపడటానికి వచ్చారు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ALSO READ: Rashmika Mandanna: మగవాళ్లకి ఒకసారైనా పీరియడ్స్ బాధేంటో తెలియాలి.. రష్మిక కామెంట్స్ వైరల్
“వందల కార్లు, బైక్‌లు, పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ పరామర్శకు వచ్చారు. రైతుల వద్దకు వెళ్లి పూలు చల్లించుకోవడం ఏమిటి? ఇదంతా చూస్తుంటే రైతుల బాధలు పంచుకోవడానికి వచ్చినట్టు కనిపించడం లేదు” అని విమర్శించారు. “తుఫాను సమయంలో జగన్ ఎక్కడ? ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలకు అండగా నిలిచారు. చంద్రబాబు ముందస్తు చర్యలు తీసుకున్నారు” అని గుర్తు చేశారు. వ్యవసాయం గురించి నీకేమి తెలుసు జగన్? “నీ తాత గ్రానైట్, తండ్రి ఫ్యాక్షన్, నువ్వు దగా వ్యాపారం” అని వ్యక్తిగత విమర్శలు చేశారు. “కేవలం ఫొటోల కోసం బురద లేని పొలంలో మట్టి అంటకుండా పర్యటించావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పొలంలో అడుగుపెట్టని నువ్వు, ఇప్పుడు వచ్చి డ్రామా ఆడుతున్నావు” అని సెటైర్ వేశారు.
“చంద్రబాబు పడి లేచిన కెరటం. అలాంటి నేతకు వార్నింగ్ ఇచ్చే అర్హత జగన్‌కు లేదు” అని మండిపడ్డారు. “జగన్ విధ్వంసకర పాలన చేసి ప్రజలు 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పటికైనా ఈ దండయాత్రలు మానుకుని ప్రజల కోసం పని చేయాలి” అని హితవు పలికారు.


