Jagan Gunmen Attack: అనంతపురం: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గన్‌మెన్లు వైకాపా కార్యకర్తపై దాడి చేసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. గురువారం అనంతపురంలో జరిగిన ఓ వివాహ వేడుకకు జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుమారుడి పెళ్లికి వచ్చిన జగన్, నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే, వేడుకకు భారీగా చేరుకున్న వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
ALSO READ: Red Alert Districts: ఈ జిల్లాల వారికి భారీ వర్ష సూచన, స్కూళ్లకు ఇప్పటికే సెలవులు..!
ఈ తోపులాటలో జగన్ గన్‌మెన్లు ఓ వైకాపా కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. సెక్యూరిటీ లైన్‌ను దాటిన కార్యకర్తపై పిడిగుద్దులతో దాడి చేసిన దృశ్యాలు వీడియోలో రికార్డై, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో ఓ మహిళ కూడా స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. ఈ దాడి వెనుక ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. కొందరు తోపులాటే కారణమని, మరికొందరు ఇతర బలమైన కారణాలు ఉండొచ్చని నెటిజన్లు చర్చిస్తున్నారు.
ఈ ఘటనపై స్థానిక వైకాపా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ సమక్షంలోనే ఇలాంటి దాడి జరగడం ఆశ్చర్యకరమని, గన్‌మెన్లు ఇంత దూకుడుగా వ్యవహరించడం సరికాదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


