వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్బంగా వైఎస్ జగన్ నేడు ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్యాంపు ఆఫీసుకు వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు.
- Advertisement -
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో ఉన్నారు. ఈ సందర్భంగా నేడు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ప్రజాదర్బర్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాలు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు.