వైయస్సార్ జిల్లా ఇడుపులపాయ, ఎకో పార్కులో పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి పనులపై సమీక్షలో భాగంగా.. వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. రెండు రోజుల కడప పర్యటనలో భాగంగా సీఎం జగన్ బిజీ షెడ్యూల్ ఫాలో అవుతూ, పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ, సొంత జిల్లా, సొంత నియోజకవర్గ ప్రజలతో విలువైన సమయం గడుపుతున్నారు.



