Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan in Sankranthi Celebrations: సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ దంపతులు

Jagan in Sankranthi Celebrations: సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ దంపతులు

గతంలో తిరుమల ఎలా ఉండేదో అలాంటి సెట్టింగ్ వేయించిన చెవిరెడ్డి

తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా జరిగిన సంబరాలు, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు, పూర్తిగా పల్లె వాతావరణం, అభివృద్ది కార్యక్రమాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయగా, సీఎం జగన్ దంపతులు సంప్రదాయ వస్త్రాలతో పాల్గొన్నారు.

- Advertisement -

వందేళ్ళ క్రితం తిరుమల ఏ విధంగా ఉండేదో అదే తరహాలో ప్రత్యేకంగా సెట్టింగ్‌ వేయటం ఈసారి ప్రత్యేకతగా అందరినీ ఆకట్టుకుంది. ప్రతి పెద్ద పండుగకు ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి ఇలా సంప్రదాయబద్ధంగా పండుగలు సీఎం జగన్ కోసం నిర్వహిస్తుండగా ఈసారి కూడా ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిపారు.

డిప్యూటీ సీఎంలు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ.సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News