Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan launched Avuku 2nd tunnel: అవుకు రెండో టన్నెల్ ప్రారంభోత్సవం

Jagan launched Avuku 2nd tunnel: అవుకు రెండో టన్నెల్ ప్రారంభోత్సవం

వరద జలాలను ఒడిసిపట్టి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే సంకల్పంతో.. ప్రజల సాగు, త్రాగు నీటి అవసరాలను తీరుస్తూ లక్షలాది రైతన్నలకు మేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జలయజ్ఞంలో మరో మైలురాయి..

- Advertisement -

‘అవుకు రెండో టన్నెల్ ప్రారంభోత్సవం..

రాయలసీమ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా రూ. 567.94 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన అవుకు ప్రాజెక్ట్ మొదటి, రెండో టన్నెలు… మూడవ టన్నెల్, ఇతర అనుబంధ పనుల్లో భాగంగా కూడా ఇప్పటికే రూ.934 కోట్ల విలువైన పనులు పూర్తి.. దీనితో ఇప్పటికే మొత్తం రూ. 1,501.94 కోట్ల విలువైన పనులు పూర్తి.. నేడు (30.11.2023) రెండో టన్నెల్ను జాతికి అంకితం చేసి గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ కు 20,000 క్యూసెక్కుల నీటిని నంద్యాల జిల్లా జిల్లా మెట్టుపల్లె వద్ద విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..”

ప్రయోజనాలు..

శ్రీశైలం కుడి గట్టు కాలువ క్రింద 1.5 లక్షల ఎకరాలకు సాగు నీటి సరఫరా.. గాలేరు నగరి సుజల స్రవంతి పథకం క్రింద గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, మైలవరం, పైడిపాలెం తదితర రిజర్వాయర్లకు రోజుకు 1 టీఎంసీ చొ॥న అదనపు నీటి సరఫరాకు వెసులుబాటు.. ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు.. 1.31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ- 640 గ్రామాల్లోని 20 లక్షల మందికి త్రాగునీరు..

వేగంగా అవుకు టన్నెల్ -3 పనులు..

కృష్ణా నదిలో వరద నీరు లభ్యమయ్యే సమయం రోజురోజుకి తగ్గిపోతున్న నేపథ్యంతో, నేడు ప్రారంభిస్తున 20 వేల క్యూసెక్కులకు అదనంగా మరో 10 వేల క్యూసెక్కుల నీటిని త్వరితగతిన తరలించేలా రూ. 1,297.78 కోట్ల వ్యయంతో చురుగ్గా అవుకు టన్నెల్-3, డిస్ట్రిబ్యూటరీ మరియు ఇతర అనుబంధ పనులు.. రూ. 934కోట్ల విలువైన పనులు ఇప్పటికే పూర్తి.. మొత్తం 5.801కి.మీ పొడవులో ఇప్పటికే 4.526 కి.మీ పనుల పూర్తి.. దీనితో మొత్తం 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు..

అవుకు ప్రాజెక్టుకు ఇప్పటి వరకు చేసిన వ్యయం

2004-05 నుండి 2013-14 వరకు 340.53 కోట్లు
2014-15 నుండి 2018-19 వరకు 81.55 కోట్లు
2019-20 నుండి 2023-24 36 వరకు 145.86 కోట్లు ఇదే సమయంలో టన్నెల్ 3 కి 934 కోట్లు. ఇప్పటివరకు చేసిన మొత్తం వ్యయం రూ. 1,501.94 కోట్లు.

అవుకు 1, 2 టన్నెల్స్ ముఖ్యాంశాలు

గోరకల్లు నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 60 కి.మీ పొడవున వరద కాలువ, కొనసాగింపుగా సొరంగం తవ్వకం పనుల పూర్తి…అన్ని అవాంతరాలను అధిగమించి, ఫాల్ట్ జోన్లో 180 మీటర్ల సొరంగం నిర్మాణంతో పాటు లైనింగ్ పనులు పూర్తి.. కుడి, ఎడమ టన్నెల్స్లో సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులు… తద్వారా రాయలసీమకు మరో 10,000 క్యూసెక్కుల నీరు అదనంగా తరలించే వెసులుబాటు.. గాలేరు-నగరి వరద కాలువ ద్వారా 15 రోజుల్లోనే గండికోట రిజర్వాయర్ నింపేందుకు అవకాశం…శ్రీశైలం జలాశయానికి వరద వచ్చే సమయంలో 20 వేల క్యూసెక్కుల చొప్పున రాయలసీమకు రోజుకు 2 టీఎంసీల నీటి సరఫరా..

రాయలసీమను సస్యశ్యామలం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు..దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ తాగు, సాగునీటి కష్టాలను, పారిశ్రామిక అవసరాలను తీర్చే లక్ష్యంతో.. ఒక వైపు గ్లోబల్ వార్మింగ్ కారణంగా వర్షాలు, వరద వచ్చే రోజులు తగ్గిపోతుంటే, మరోవైపు పక్క రాష్ట్రం వివిధ లిఫ్ట్ల ద్వారా 800 అడుగుల లోపు నుంచే వీటిని డ్రా చేయడంతో పాటు విద్యుత్తును ఉత్పత్తి కూడా చేస్తున్న పరిస్థితి.. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో 875 అడుగులు మించితే గానీ మనకు కేటాయించిన పూర్తి నీటిని డ్రా చేయలేని స్థితిని చక్కదిద్దుతూ.. ఒకవైపు కాలువల సామర్థ్యం పెంచుతూనే, మరో వైపు 797 అడుగుల నుంచే నీరు తీసుకోగలిగి త్వరితగతిన ప్రాజెక్టులు నింపేలా, రోజుకు 3 టీఎంసీల జలాలను కరవు ప్రాంతాలకు న్యాయం చేస్తూ తరలించడానికి చురుగ్గా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు..

రాయలసీమ దుర్భిక్షనివారణ పథకం క్రింద..

పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు కాలువల వెడల్పు, లైనింగ్ పనులు, అదనపు టన్నెల్స్ నిర్మించి గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల ద్వారా తక్కువ సమయంలో అన్ని పథకాలకు సరిపడా నీరు అందించడానికి చర్యలు…రూ.600 కోట్ల వ్యయంతో తెలుగు గంగ లింక్ కెనాల్ ప్రవాహ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులకు విస్తరణ..

SRBC, GNSSల సామర్థ్యం రెండూ కలిపి 30వేల క్యూసెక్కులకు పెంచేందుకు చురుగ్గా పనులు.. కుందూ నది, నిప్పుల వాగు సామర్థ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచి సోమ శిల వరకు నీటి సరఫరా.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన బ్రహ్మంసాగర్ రిజర్యాయర్ లీకేజి సమస్యను ప్లాస్టిక్ డయాఫ్రమ్ వాల్ సాంకేతికతతో అరికట్టడంతోపాటు తక్కువ సమయంలో అన్ని ప్రాజెక్టులకు సరిపడా నీళ్లందించేలా రూ.600 కోట్లతో తెలుగు గంగ కాలువ సామర్థ్యాన్ని లైనింగ్ ద్వారా పెంచి పూర్తి సామర్థ్యం మేరకు 17 టీఎంసీల నీరు నింపిన రాష్ట్ర ప్రభుత్వం.

253 కోట్లతో లక్కసాగరం వద్ద HNSS పంప్ హౌస్ ప్రాజెక్ట్ చేపట్టి ఇప్పటికే పూర్తి చేసి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చెరువులకు సాగు నీరు అందించి 10 వేల ఎకరాలకు పైగా సస్యశ్యామలం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News