Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan: త్వరలో 'జగనన్నకు చెబుదాం', మరో ప్రతిష్ఠాత్మక ప్రోగ్రాం

Jagan: త్వరలో ‘జగనన్నకు చెబుదాం’, మరో ప్రతిష్ఠాత్మక ప్రోగ్రాం

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీ సాగింది. జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష పథకం, నాడు – నేడు (స్కూల్‌ ఎడ్యుకేషన్‌) పై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే…:

- Advertisement -

మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం, మే 9న జగనన్నకు చెబుదాం ప్రారంభిస్తున్నాం అంటూ సీఎం జగన్ ప్రకటించారు.
– దీనికోసం 1902 అనే హెల్ప్‌లైన్‌ నంబర్‌ను పెడుతున్నాం:
– చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
– ఈ కార్యక్రమంపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశాం:
– జగనన్నకు చెబుదాం పేరులో ముఖ్యమంత్రి అయిన నా పేరును కలిపారు:
– అంటే ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంతో ఇట్టే అర్థం అవుతుంది.
– ఇది చాలా ప్రతిష్ట్మాతకమైన కార్యక్రమం.
– మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నాం.
– స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం.
– నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం.
– ఇండివిడ్యువల్‌ గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.
– హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి గ్రీవెన్స్‌ రిజిస్టర్‌ చేస్తే.. దాన్ని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి.

– సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయి.
– ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్‌ చేయాలి.
– గ్రీవెన్స్‌ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలి.
– ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యం.
– ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల(పీఎంయూ)ను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుంది.
– హెల్ప్‌లైన్‌ద్వారా గ్రీవెన్స్‌ వస్తాయి.
– వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలి.
– గ్రీవెన్స్‌ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం.

– ఇండివిడ్యువల్, కుటుంబం స్థాయిలో గ్రీవెన్సెస్‌.
– రిజ్టసర్‌ అయిన గ్రీవెన్సెస్‌ ఫాలో చేయడం.
– ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ.
– ముఖ్యమంత్రిగారి సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది జగనన్నకు చెబుదాం ప్రధాన కార్యక్రమాలు.

– ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్‌ అయి ఉంటారు.
– వారి గ్రీవెన్స్‌స్‌ను సలహాలను నేరుగా తెలియజేయవచ్చు.
– ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ గ్రీవెన్స్‌స్‌ను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుంది.

– ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు క్రమం తప్పకుండా అప్‌డేట్స్‌ అందుతాయి.
– అంతేకాక ఇదే హెల్ప్‌లైన్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటుంది.

– గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్‌ గురించి అవగాహన కల్పిస్తారు.
– ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తారు.
– జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభంలోగా వాలంటీర్లు ప్రతి గడపకూ 1902 గురించి చెప్తారు:

– సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయి.

– సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా ఉంటారు.
– క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వీరు సందర్శించి పర్యవేక్షిస్తారు.
– ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను çసందర్శించి పర్యవేక్షిస్తారు.
– కలెక్టర్లతో కలిపి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు.
– సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్‌చేస్తారు.
– ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారు.
– ఎక్కడైనా సమస్య పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోతే.. దాన్ని తిరిగి ఓపెన్‌ చేస్తారు.
– ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు.
– పరిష్కార తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు:
– చీఫ్‌సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్‌ చేస్తారు.
– ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది.

– ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగారి పేరు పెట్టారు అంటే.. ఇది ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవలి:
– అధికారుల మీద ఆధారపడే ముఖ్యమంత్రి తన విధులను నిర్వహిస్తాడు.
– మీరు అంత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసినట్లే.
అప్పుడే ఈ కార్యక్రమం సమర్థవంతంగా సాగుతున్నట్టు లెక్క.
– అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.
– ప్రజలకు నాణ్యంగా సేవలను అందించాలన్నదే దీని ఉద్దేశం.
– ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది.
– అవసరమైన చోట.. ఈ డబ్బును ఖర్చు చేయవచ్చు.
– వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నాం.

  • కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, మానిటరింగ్ యూనిట్లు గ్రీవెన్స్‌తో పాటు గ్రామస్ధాయిలో అన్ని అంశాలపైనా దృష్టి పెడతారు.
    – దీనివల్ల వేగవంతంగా గ్రీవెన్స్‌స్‌ పరిష్కారంలో డెలివరీ మెకానిజం ఉంటుంది.
    – అంతేకాకుండా గ్రామ స్థాయిలోని సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్‌వాడీలు, విలేజ్‌క్లినిక్స్‌.. అవన్నీకూడా సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న అంశంపైన కూడా దృష్టిపెడతారు.
  • గ్రామాలలో ఇళ్ల నిర్మాణంపైనా దృష్టి పెడతారు.
    – ఇవి సక్రమంగా పనిచేస్తే గ్రామస్ధాయిలో చాలావరకు సమస్యలు సమసిపోతాయి.
    – అవి సమర్థవంతంగా పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం.
    –దీనికోసమే మానిటరింగ్‌ కమిటీలతో పాటు స్పెషల్‌ ఆఫీసర్లను ఏర్పాటు చేస్తున్నాం.

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం
– పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు ఎలాంటి లోటు లేదు.
– 2022–23 సంవత్సరంలో 10,203 కోట్లు ఖర్చు చేశాం.
– ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయనున్నాం.
– ఎక్కడా కూడా బకాయిలు లేవు.
– ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
– పేదలందరికీ ఇళ్ల కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలి.
– కొన్ని జిల్లాల కలెక్టర్లు ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
– వేయికిపైగా ఇళ్లు నిర్మిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.

– ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు పావలావడ్డీకే రుణాలు ఇప్పించేలా చర్యలు ముమ్మరం చేయాలి.
– ఇప్పటికే 10.03 లక్షల లబ్ధిదారులకు రూ.3,534 కోట్లకుపైగా రుణాలు మంజూరు అయ్యాయి.
– కలెక్టర్లు బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

– ప్రతి శనివారం హౌసింగ్‌ డేగా పరిగణించాలి.
– హౌసింగ్‌ కార్యక్రమంలో నిమగ్నమైన అధికారులు తప్పనిసరిగా రెండు లే అవుట్లను సందర్శించాలి.
– దీనివల్ల అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి, నిర్మాణాల్లో నాణ్యత కూడా ఉంటుంది.
– ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 48వేల మంది పేదలకు ఏపీ సీఆర్డీయే ప్రాంతంలో మే రెండో వారంలో ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లూ చేయాలి.

జగనన్న భూహక్కు మరియు భూ రక్ష(సమగ్ర సర్వే)
ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం.
దేశంలో ఎక్కడా కూడా సమగ్ర సర్వే జరగలేదు.
100 ఏళ్ల తర్వాత మన రాష్ట్రంలో చేస్తున్నాం.
దేశానికి అంతటికీ ఆదర్శప్రాయమైన కార్యక్రమం.
జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం ద్వారా మనకు సముచిత స్థానం లభిస్తుంది.
కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని ఓన్‌ చేసుకోవాలి.
భూ హక్కు పత్రాల పంపిణీ, సరిహద్దు రాళ్లు పాతడం, గ్రామాల్లో భూముల రికార్డుల్లో తుది వివరాలు నమోదు, గ్రామ సచివాలయాల్లోనే సబ్‌ రిజిస్ట్రార్‌ సేవలు లభ్యం కావడం ఇదీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశం.
రాష్ట్రంలోని మొత్తం 17,464 రెవెన్యూ గ్రామాలకు గానూ… మొదటి విడతలో 2వేల గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమం తుదిదశకు చేరుకుంటోంది.
దీన్ని త్వరగా పూర్తిచేయాలి.
కలెక్టర్లు దీనిపై దృష్టిపెట్టి.. రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీతోపాటు తర్వాత దశల్లో సర్వే చేపట్టే కార్యక్రమాలపై దృష్టిపెట్టాలి.
పొరపాట్లకు తావులేకుండా కచ్చితమైన వివరాలతో భూ హక్కు పత్రాలు అందాలి.
మే 25 నుంచి రెండో దశలో మరో 2వేల గ్రామాల్లో సర్వే ప్రారంభం అవుతుంది.

పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం.
– విద్యాశాఖలో నాడు – నేడుకు సరిపడా నిధులు ఉన్నాయి.
– తల్లిదండ్రులు కమిటీల ఖాతాల్లో రూ.734.21 కోట్లుఉన్నాయి.
– పనులను వేగంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
– తదుపరి ఖర్చులకోసం మరో రూ.1400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
– నాడు – నేడుకు నిధుల కొరత లేదు. పనులను మరింత వేగవంతంగా చేపట్టాలి.

– ఐఎఫ్‌పీ పానెళ్లు బిగించడం పూర్తి కావడం ద్వారా… 15,715 స్కూళ్లలో చేపట్టిన మొదటి విడత నాడు – నేడు పనులు పూర్తయినట్టు అవుతుంది.
– దీంతో 6వ తరగతి ఆ పైతరగతులకు సంబంధించి 30,230 తరగతి గదుల్లో డిజిటలైజేషన్‌ కూడా పూర్తవుతుంది.
– జూన్‌ 12 లోగా ఈ ఐఎఫ్‌ఎప్‌ ప్యానెళ్ల బిగింపు పూర్తి కావాలి.

– ఫేజ్‌ 2లో 16,461 యునిక్‌ స్కూళ్లలో నాడు నేడు చేపడుతున్నాం.
– ఫేజ్‌ 3లో సుమారు మరో 13 వేల స్కూళ్లలో నాడు నేడు కింద పనులు జరగనున్నాయి.

– మూడు విడతల్లో దాదాపు 45 వేల స్కూళ్లలో నాడు –నేడు పనులు పూర్తవుతాయి.
– వేసవి సెలవుల్లో పనులు చేయడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి.
– ఈ సమయాన్ని పనులకోసం బాగా వినియోగించుకోవాలి.
– కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.

– మొదటి విడతలో నాడు– నేడు కింద పనులు చేపట్టిన పాఠశాలలపై పూర్తిస్థాయి ఆడిట్‌ చేపట్టాలి.
– ఎక్కడైనా లోపాలు ఉంటే.. వెంటనే వాటిని సరిదిద్దాలి.
– ఇంత పెద్ద మొత్తంలో స్కూళ్లలో పనులు చేపడుతున్నాం.
– పనుల్లో నాణ్యత లోపించకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
– గ్రామ, వార్డు సచివాలయాలను సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి.
– పేరెంట్స్‌ కమిటీ సేవలను కూడా వినియోగించుకోవాలి.
– ఇసుక, సిమ్మెంటు, స్టీలు లాంటివి కొరతలేకుండా వాటి పంపిణీపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి.
తద్వారా పనుల్లో ఆలస్యం జరగకుండా నివారించవచ్చు.

– 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి సుమారు 5,18,740 లక్షల ట్యాబులు ఇచ్చాం.
– వీటి ద్వారా విద్యార్థులకు ప్రయోజనాలు అందేలా చూడాలి.
– అవి సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలి.
– సమస్యలుంటే..ఏం చేయాలన్నదానిపై దానిపై ఎస్‌ఓపీ రూపొందించాం.
– ఏమైనా సమస్యలు ఉంటే హెడ్మాస్టర్‌కు గాని, స్థానికంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయల్లోగాని ఇస్తే.. 3 రోజుల్లోగా రిపేరు చేసి తిరిగి ఇస్తారు.
– ఈ ఎస్‌ఓపీ అమలు జరుగుతుందా? లేదా? అన్నది కలెక్టర్లు చూడాలి.
– గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్లు.. స్కూలుకు వెళ్లి.. అక్కడున్న ఉపాధ్యాయులు, పిల్లలకు ట్యాబుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు.
– నెలకోసారి తప్పనిసరిగా స్కూల్‌ డిజిటల్‌ డే పాటిస్తూ.. వారు స్కూళ్లకు వెళ్తారు.
– ప్రభుత్వం ఇచ్చిన ట్యాబుల వినియోగంపై అవగాహన కల్పించడం, వినియోగించడంపై వీరు శిక్షణ ఇస్తారు.

జగనన్న విద్యా కానుక..
– స్కూళ్లు జూన్‌ 12న తిరిగి తెరుస్తారు, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలి.
– ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదు.
– దాదాపు 43.10 లక్షల మందికి జగనన్న విద్యాకానుక అందుతుంది.
– విద్యాకానుక పంపిణీపై మంచి ప్రోటోకాల్‌ను పాటించాలి.
– అలాగే జగనన్న విద్యాకానుక కింద అందించే వస్తువుల క్వాలిటీపైన కూడా బెస్ట్‌ ప్రోటోకాల్‌ పాటించాలి.
– బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, 3 జతల యూనిఫామ్, నోట్‌ బుక్స్, బ్యాగ్, షూ, రెండు జతల సాక్స్, ఆక్సఫర్డ్‌ డిక్షనరీ, బెల్టు, వర్క్‌బుక్స్‌తో కూడిన కిట్‌ నాణ్యతను పిల్లలకు అందించే ముందు కచ్చితంగా పరీక్షించాలి.
– కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను మానిటరింగ్‌ చేయాలి.
– జగనన్న విద్యాకానుకపై ఏ స్కూలు నుంచైనా, ఏ విద్యార్థినుంచైనా నాకు ఫిర్యాదులు రాకూడదు.
– స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు పిల్లలకు విద్యాకానుక అందించాలి.

– గతంలో నా పాదయాత్ర టైంలో నేను స్వయంగా చూశాను, ఎప్పుడూ పుస్తకాలు టైముకు ఇచ్చేవారు కాదు.
– అక్టోబరు, నవంబరు వచ్చినా.. అవి పిల్లలకు అందేవి కావు.
– మనం వచ్చాక స్కూళ్లపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాం.
– మొత్తం వ్యవస్థలోనే మార్పులు తీసుకు వచ్చాం.
– స్కూళ్లలో పిల్లలకు చేస్తున్న కార్యక్రమాలను కలెక్టర్లు ఓన్‌ చేసుకోవాలి.
– అలాగే పాఠశాల్లో నైట్‌ వాచ్‌మెన్లును నియమించడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి.

మాదక ద్రవ్యాల నివారణపై పోలీసు అధికారులు దృష్టిపెట్టాలి.
– ప్రతి కాలేజీలోకూడా ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలి.
– వీటికి సంబంధించి పెద్ద పెద్ద హోర్డింగ్స్‌ పెట్టాలి.
– జిల్లాల పోలీసు కార్యాలయాల్లో ప్రత్యేక డివిజన్‌ను ఏర్పాటు చేయాలి.
– మాదక ద్రవ్యాల నివారణే వీటి ఉద్దేశం కావాలి.
– కాలేజీల్లో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి.
– వారి నుంచి నిరంతరం సమాచారం తీసుకోవాలి.
– పిల్లలు వీటి బారిన పడకుండా వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించాలి.
– మాదకద్రవ్యాలు తయారుచేస్తున్నవారు, రవాణా, పంపిణీచేస్తున్నవారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి.
– గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు అవగాహన కల్పించాలి.
– 15వేలమందికిపైగా మహిళా పోలీసులు ఉన్నారు.
– వారు సమర్థవంతంగా పనిచేసేలా, వారి నుంచి మంచి సేవలు పొందేలా చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News