డీలిమిటేషన్(Delimitation)పై ప్రధాని మోడీ(PM Modi)కి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనలో(Delimitation)దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో కోరారు. జనాభా ప్రాతిపదికన 2026లో జరిగే డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన ఉందన్నారు. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
గత 15 ఏళ్లుగా దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తగ్గిందని.. గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు మేరకు ఈ తగ్గుదల కనిపించిందన్నారు. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం డిలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు భాగస్వామ్యం తగ్గుతుందని.. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాలని జగన్ విజ్ఞప్తి చేశారు.


