వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ సోమవారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా వయోభారంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజాగా పిచ్చమ్మ పార్థివదేహానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) నివాళి అర్పించారు.

తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో మేదరమెట్లలోని సుబ్బారెడ్డి నివాసానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించి వైవీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. జగన్‌తో పాటు ఆయన తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. మేదరమెట్ల చేరుకున్న జగన్‌కు అభిమానులు ఘన స్వాగం పలికారు. ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారికి జగన్ నమస్కరిస్తూ ముందుకు సాగారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
