రేపు పులివెందుల పర్యటనకు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు వైయస్సార్ జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్ళనున్నారు. రేపు (06.07.2024) మధ్యాహ్నం 12.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడినుంచి రోడ్డు మార్గంలో పులివెందుల బయలుదేరి వెళతారు, మూడు రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు.
