- ఆరోగ్య శ్రీ సేవలను పొందడంపై ప్రతి ఒక్కొరికీ కూడా అవగాహన కల్పించాలన్న సీఎం.
- దీనికోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశం.
- సెప్టెంబరు 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అన్నిరకాలుగా సిద్ధంచేసుకోవాలన్న సీఎం.
- ప్రతి కుటుంబానికీ కూడా ఆరోగ్య శ్రీ సేవలను ఎలా పొందాలన్న దానిపై సమగ్ర వివరాలతో బుక్‌లెట్ అందిందాలని సీఎం ఆదేశం.
- ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందడం ఎలా? అన్నదానిపై ప్రతి ఒక్కరికీ కూడా అవగాహన ఉండాలి: సీఎం
- విలేజ్ క్లినిక్ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా పూర్తి వివరాలతో సమాచారం అందించాలి:
- వీళ్లు ప్రతి ఇంటికీ వెళ్లికూడా ఆరోగ్య శ్రీ గురించి సవివరంగా తెలియజేయాలి:
- అనారోగ్యం వచ్చినా, దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగినా ఆరోగ్య శ్రీ కింద ఎలా చికిత్స పొందాలన్నదానిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి:
- వారు ఉంటున్న ప్రాంతానికి అత్యంత సమీపంలోని నెట్‌వర్క్ ఆస్పత్రిలో ఎలా చికిత్స అందుకోవాలన్నదానిపై అవగాహన ఉండాలి, ప్రజలకూ తెలియజేయాలి:
- ఆరోగ్య శ్రీ సేవలపై సంపూర్ణ సమాచారం తెలియడమే కాదు, సమర్థవంతంగా సేవలు అందుకోవడం దీని లక్ష్యం:
- ఆరోగ్య శ్రీ సేవలు అందుకోవడం ఎలా? అన్న విషయం తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు, దీనికోసం విస్తృత ప్రచారం నిర్వహించండి:
- రాష్ట్రంలో ప్రతికుటుంబానికీ దీనిపై బుక్‌లెట్ అందించాలన్న సీఎం.
- ఒక్క యాప్‌ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా, ఇతర కాల్ సెంటర్ల ద్వారా కూడా ఆరోగ్య శ్రీ సేవలు పొందడంపై పూర్తి అవగాహన ఉండాలి:
- ఆరోగ్య శ్రీ కింద అందే చికిత్సల సంఖ్యను ఈ ప్రభుత్వం రాకముందు 1000 ఉంటే, ఇప్పుడు 3,255కి పెంచాం: సీఎం
- ఈసేవలను పొందడంపై ప్రజలకు పూర్తి అవగాహన, సమాచారం ఉండాలి:
- సేవలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, లంచాల ప్రస్తావన వచ్చినా ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన నంబర్లనుకూడా ప్రజలకు తెలియచెప్పాలి:
- నెట్‌వర్క్ ఆస్పత్రులు వారి వారి పరిధిలో తప్పనిసరిగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలి:
- ఇది కచ్చితంగా అమలయ్యేలా చూడాలి:
- విలేజ్ క్లినిక్స్, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుని ఈ శిబిరాలు అమలు జరిగేలా చూడాలి: సీఎం
నూతన మెడికల్ కాలేజీలు, నిర్వహణ
- ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థవంతంగా ఉండాలన్న సీఎం
- నిర్వహణకు నిధులు సమస్య రాకుండా చూసుకునేందుకు ఒక విధానం తీసుకురావాలని అధికారులకు ఆదేశం
- నిర్మాణాలు చేయడం, పరికరాలు ఏర్పాటు చేయడం అన్నది ఎంత ముఖ్యమో, వాటిని ఉత్తమంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం:
- అలా చేయకపోతే పరిస్థితులు మళ్లీ మొదటి వస్తాయన్న సీఎం
- ఆయా ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద అందించే సేవలకు గాను ప్రభుత్వం నుంచి వాటికి వెళ్లే నిధులు ఆయా ఆస్పత్రుల నిర్వహణకు వినియోగించేలా ఒక పద్ధతిని తీసుకురావాలన్న సీఎం
- ఇలా చేయకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు నిర్వహణ నాణ్యతతో చేయడం కష్టం అవుతుందన్న సీఎం.
- అలాగే ప్రభుత్వ విద్యాసంస్థలకు ఇచ్చే ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బుల్లో కూడా కొంత ఆయా సంస్థల నిర్వహణకు వినియోగించేలా ఒక విధానం తీసుకురావాలన్న సీఎం.
- శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి కాలానికి గాను ఆరోగ్య ఆసరా పథకం కింద రోగికి ఇవ్వాల్సిన డబ్బును డిశ్చార్జి రోజే అందించాలని సీఎం ఆదేశం.
- దీనికి కావాల్సిన ఎస్‌ఓపీని రూపొందించాలని అధికారులకు ఆదేశం.
- ప్రభుత్వ రంగంలో కొత్తగానిర్మిస్తున్న 17 మెడికల్ కాలేజీల నిర్మాణాల్లో ప్రగతి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నాడు – నేడు పనులు, ఇతర స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణాలపై సీఎం సమీక్ష.
- కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోందని తెలిపిన అధికారులు.
- ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అనూహ్య స్పందన వస్తోందన్న అధికారులు.
- సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సుల్లోనూ ప్రైవేటు కాలేజీల్లో కన్నా, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల్లో చేరేందుకే ఆసక్తి చూపిస్తున్నారన్న అధికారులు.
- ఈ ఏడాది విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలోని ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు.
- వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సిద్ధం అవుతున్నామన్న అధికారులు.
- పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపూర్ మదనపల్లెల్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలకు సిద్ధం అవుతున్నామన్న అధికారులు.
- 2025-26 విద్యా సంవత్సరంలో మిగిలిన మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తిచేసుకుని ప్రవేశాలకు సిద్ధం అవుతున్నాయన్న అధికారులు.
- పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీలో కూడా పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం.