జగన్ తొలిరోజు బస్ యాత్రకు జనం పోటెత్తారు. దీంతో మనమంతా సిద్ధం బస్ యాత్ర సూపర్ సక్సెస్ గా మారింది. అడుగడుగునా జగన్ కు జనం నీరాజనం పలుకుతూ, అన్ని వర్గాల ప్రజలు జగన్ ను ఆత్మీయంగా అక్కున చేర్చుకోవటం విశేషం. జగన్ ను చూసేందుకు చిన్నా పెద్ద ఆసక్తిగా వీధుల్లోకి వచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా జనసామాన్యం ఆసక్తిగా రోడ్లపైకి రావటంతో వైసీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని జోష్ నింపుతోంది.







