Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan tour in Emmiganuru: ఎమ్మిగనూరులో జగన్ టూర్

Jagan tour in Emmiganuru: ఎమ్మిగనూరులో జగన్ టూర్

జగనన్న చేదోడు పథకం కింద నగదు జమ

కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో ముఖ్యమంత్రి జగన్ గురువారం పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని చేనేత కాలనీలో ఉన్న వై ఎం సి డబ్ల్యూ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభా వేదిక నుండి జగనన్న చేదోడు పథకం కింద ఎంపికైన రజకులకు, నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి… గురువారం ఉదయం 8:30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. 9:45 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడినుండి 9:55 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి ఎమ్మిగనూరులో ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు 10:15 గంటలకు చేరుకుంటారు. అక్కడ పది నిమిషాల పాటు జిల్లా ప్రజా ప్రతినిధులతో ముచ్చటించనున్నారు. అక్కడినుండి ప్రత్యేక కాన్వాయ్ లో బయలుదేరి 10:35 గంటలకు చేనేత కాలనీలోని వై ఎం సి డబ్ల్యూ గ్రౌండ్ కు చేరుకుంటారు. 11:05 గంటలకు జభాస్తలికి చేరుకొని ఐదు నిమిషాల పాటు జగనన్న చేదోడు పథకంపై రూపొందించిన వీడియోలు ప్రదర్శించనున్నారు. 11:10 నుండి 11:55 గంటలకు వరకు ముఖ్యమంత్రి జగన్ లబ్ధిదారులను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 11:55 నుండి 12 గంటల మధ్య జగనన్న చెదోడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో బటన్ నొక్కి జగన్ ఆన్లైన్ ద్వారా నగదును జమచేస్తారు. 12 20 నుండి 12:50 మధ్య హెలిప్యాడ్ కు చేరుకొని ప్రజా ప్రతినిధులతో మాట్లాడతారు మధ్యాహ్నం 1:15 నిమిషాలకు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు 2:10 చేరుకుంటారు. 2:35 గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

- Advertisement -

బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ అని నిండు మనసుతో నమ్మి మనసా, వాచా, కర్మణా ఆచరిస్తూ రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని, వారు మిగతా ప్రపంచంతో పోటీపడి ఎదగాలని వారికి చేదోడునిస్తూ…

వరుసగా నాలుగో ఏడాది ‘జగనన్న చేదోడు”

రాష్ట్ర వ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో నేడు (19.10.2023) బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జను చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి….

షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ. 10,000 చొప్పున సాయం.. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.40,000 వరకు ఆర్థిక సాయం, అందించిన జగనన్న ప్రభుత్వం..

నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఈ 4 ఏళ్ళలో కేవలం ఈ పథకం ద్వారా మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు..

1,80,656 మంది టైలర్లకు ఈ విడత సాయంగా రూ. 180.66 కోట్ల లబ్ధి..
39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్ల లబ్ధి ..
1,04,551 మంది రజకులకు ఈ విడత సాయంగా రూ. 104.55 కోట్ల లబ్ధి..

లంచాలకు, వివక్షకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్ ప్లే చేసి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక..
ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే మిస్ కాకుండా సాయం అందాలని తపన పడుతున్న జగనన్న ప్రభుత్వం…
అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ – పథకాల లబ్ది అందని వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ. జూన్, డిసెంబర్ లలో లబ్దిని – అందచేస్తున్న జగనన్న ప్రభుత్వం.

జగనన్న చేదోడు పథకం క్రింద ఇప్పటి వరకు అందించిన లబ్ధి..
2020-21 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 2,98,122 సాయం (రూ. కోట్లలో) 298.12
2021-22 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 2,99,225 సాయం (రూ. కోట్లలో) 299.23
2022-23 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 3,30,145 సాయం (రూ. కోట్లలో) 330.15
2023-24 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 3,25,020 సాయం (రూ. కోట్లలో) 325.02
మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News