ముఖ్యమంత్రి వైయస్. జగన్ కాలినొప్పితో బాధపడుతున్నారు. ఉదయం ఎక్సర్‌సైజ్ చేస్తున్న సమయంలో కాలు బెణికింది. సాయంత్రానికి ఈ నొప్పి మరింత పెరిగింది. గతంలో ఇలానే కాలికి గాయం అయింది. అప్పట్లోనూ కాలి నొప్పితో చాలా రోజులపాటు జగన్ ఇబ్బంది పడ్డారు. తాజాగా మళ్లీ కాలినొప్పి మొదలయింది. ఈనేపథ్యంలో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని జగన్ కు డాక్టర్ల సూచించారు. దీంతో రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దు చేశారు అధికారులు.
Jagan: జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES