జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు సీఎం వైఎస్ జగన్.
- Advertisement -
ఈ కార్యక్రమానికి మంత్రులు మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరామ్, కే.వి.ఉషాశ్రీ చరణ్, బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్ జి.అనంతరాము, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ ఎఎండీ.ఇంతియాజ్, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ కే.విజయ, గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ లక్ష్మిషా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.