Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: సెప్టెంబర్ 30 నుండి 'జగనన్న ఆరోగ్య సురక్ష' పథకం

Kurnool: సెప్టెంబర్ 30 నుండి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ పథకం

రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ పథకంను సెప్టెంబర్ 30 వ తారీకు నుండి ప్రారంభించనున్నట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీ.ఎం. ఆఫీస్
పూనం మాలకొండయ్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కృష్ణబాబు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

- Advertisement -


స్పెషల్ చీఫ్ సెక్రెటరీ పూనమ్ మాలకొండయ్య, సి.ఎం.ఆఫీస్ ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కృష్ణబాబు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష మేరకు ప్రతి గ్రామ సచివాలయం వారీగా “జగనన్న ఆరోగ్య సురక్ష ” పథకం అమలుకు చేయవలసిన పనులు, శిక్షణ ఏర్పాట్లు, వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లకు వివరించారు. వారి నుండి సలహాలు స్వీకరించారు. మొదట గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్, ఏ.ఎన్.ఎం.లు గ్రామంలో ఒక సగం వాలంటీరు మిగిలిన సగం గ్రామం ఏ.ఎన్.ఎం. సెప్టెంబర్ 15 తారీఖు నుండి ఇంటింటికి తిరిగి ఇంట్లో ఉన్న పిల్లలు, వృద్దులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మొదలగు వారి అనారోగ్య సమస్యలను గుర్తించి వారికి కావలసిన వైద్య సదుపాయాల వివరాలు సేకరించి వాటిని ఒక ప్రత్యేకమైన యాప్ లో 15 రోజుల లోపు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ గ్రామానికి “జగనన్న ఆరోగ్య సురక్ష ” టీం ఎపుడు వస్తారు అన్న విషయం వారికి తెలియజేసి వారిని ఆ రోజు శిబిరం దగ్గరకు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. గ్రామంలోని పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థికి దేహంలో ఉన్న సమస్యలు, కంటి సమస్యలను ఏ.ఎన్.ఎం., ఉపాధ్యాయులు గుర్తించి ఆ సమాచారం కూడా యాప్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. క్యాంప్ సమయంలో కంటి చూపు సరిగా లేని విద్యార్థులను పరీక్షించి కావలసిన కళ్ల అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మండలంలోని గ్రామాలలో జరిగే “జగనన్న ఆరోగ్య సురక్ష” పథకం అమలుకు మండలం అభివృద్ధి అధికారి, మండల తహసీల్దారులు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు. మండలాన్ని రెండు భాగాలుగా చేసుకొని తాహసిల్దారు మరియు ఎం.డి.ఓ. క్యాంప్ కు కావలసిన ఏర్పాట్లు కార్యక్రమానికి గ్రామములోని పంచాయతీ ఆఫీసు, స్కూలు బిల్డింగు, హెల్త్ క్లినిక్ నందు ప్రజలకు దగ్గరలో అనుకూలంగా ఉన్న ప్రదేశాన్ని నిర్ణయం చేసుకొని కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమం 45 రోజులపాటు నిర్వహిస్తామన్నారు. ఇందుకుగాను ఎన్. ఎస్. ఎస్, ఎన్జీవో, రెడ్ క్రాస్ సభ్యుల సేవలు వినియోగించుకోవాలని వారి సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం వారికి సేవ అభినందన పత్రం అందజేస్తుందని తెలిపారు. ప్రతి క్యాంపుకు ఇద్దరు డాక్టర్లలో ఒకరు గైనకాలజిస్ట్, ఒకరు జనరల్ ఫిజీషియన్, ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అందుబాటులో ఉండే విధంగాను మరియు హెల్త్ సెంటర్లో ఇద్దరు డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. క్యాంప్ సమయంలో డాక్టర్ల ఏర్పాట్లలో ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలపాలని కోరారు. క్యాంప్ కు కావలసిన మందులు మరియు సంబంధిత కిట్లు అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని తెలిపారు. గ్రామాల్లో జరిగిన విధంగా ” జగనన్న ఆరోగ్య సురక్ష ” పథకం పట్టణ మరియు మున్సిపాలిటీలలో కూడా జరపాలని అందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. పై ఏర్పాట్లు కొరకు కలెక్టర్లు సంబంధిత అధికారులతో సమీక్షించుకొని సెప్టెంబర్ 30 వ తారీకు మొదలుకానున్న ” జగనన్న ఆరోగ్య సురక్ష ” పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కర్నూలు వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇన్చార్జి కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య గారు, డి .ఎం.హెచ్.ఓ రామ గిడ్డయ్య, డిపిఓ నాగరాజు నాయుడు, సోషల్ వెల్ఫేర్ డీ.డీ.శ్రీనివాసులు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ డి.డి వెంకటలక్ష్మి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News