Friday, January 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagananna Colony: జగనన్న కాలనీల పేరు మార్చిన ప్రభుత్వం

Jagananna Colony: జగనన్న కాలనీల పేరు మార్చిన ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన పథకాల పేర్లను మార్చిన సర్కార్.. తాజాగా జగనన్న కాలనీల(Jagananna Colony) పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇకపై ఈ కాలనీలను ‘పీఎంఏవై-ఎన్టీఆర్‌’ నగర్‌గా పిలవనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఆ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వ నిధులను కలిపి పక్కా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News