Saturday, February 14, 2026
Homeఆంధ్రప్రదేశ్MLA Arava Sridhar: మరికొద్ది సేపట్లో పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్!

MLA Arava Sridhar: మరికొద్ది సేపట్లో పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్!

Jana Sena Party: జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరికొద్ది సేపట్లో పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందుకు హాజరుకానున్నారు. గత కొంతకాలంగా ఆయనపై వస్తున్న తీవ్రమైన లైంగిక ఆరోపణల నేపథ్యంలో.. పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌ వేదికగా శ్రీధర్‌ను విచారించనుంది.

- Advertisement -

జనసేన సీరియస్: నిన్న జరిగిన పార్టీ సమావేశంలో అధినేత పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రతి ఒక్కరి చిట్టా నా దగ్గర ఉంది” అని హెచ్చరించిన పవన్.. శ్రీధర్ విషయంలో తక్షణమే నివేదిక సమర్పించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను ఆదేశించారు.

Also read-Ambati Rambabu: మాజీ మంత్రి అంబటికి 14 రోజులు రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

అజ్ఞాతం వీడిన ఎమ్మెల్యే శ్రీధర్‌: వాస్తవానికి శ్రీధర్‌కు కమిటీ ఎప్పుడో నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అయితే పవన్ కల్యాణ్ గట్టిగా హెచ్చరించిన మరుసటి రోజే ఆయన కమిటీ ముందుకు రావడం గమనార్హం.

తీవ్ర ఆరోపణలు: వీణ అనే మహిళ అరవ శ్రీధర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తనను ప్రేమించి మోసం చేశారని పేర్కొన్నారు. ఐదు సార్లు అబార్షన్ సైతం చేయించారని ఆమె ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కాల్స్, చాటింగ్ స్క్రీన్ షాట్‌లను కూడా ఆమె బయటపెట్టారు. సదరు మహిళతో అసెంబ్లీ ప్రాంగణంలోనే శ్రీధర్ వీడియో కాల్ మాట్లాడినట్లు వచ్చిన దృశ్యాలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించాయని నేతలు భావిస్తున్నారు.

Also read-Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడి కేసు.. 11 మంది టీడీపీ నేతల అరెస్ట్

విచారణ అనంతరం చర్యలు: త్రిసభ్య కమిటీ కేవలం ఎమ్మెల్యే శ్రీధర్‌నే కాకుండా స్థానిక నియోజకవర్గ నేతలు మరియు కార్యకర్తల అభిప్రాయాలను సైతం సేకరించనుంది. ఈ విచారణ అనంతరం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా శ్రీధర్‌పై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News