HomeTop StoriesJana Sena: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌.. అధినేత కీలక ప్రకటన

Jana Sena: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌.. అధినేత కీలక ప్రకటన

Jana Sena Rajya Sabha candidate finalized: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై జనసేన పార్టీ ఎట్టకేలకు తెరపడింది. నిన్న సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన కూటమి సమావేశంలో.. టీడీపీకి మూడు, జనసేనకు ఒక టికెట్‌ కేటాయించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే జనసేన కోటా నుంచి ఎవరు రాజ్యసభకు వెళ్లనున్నారనే విషయంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. ఎట్టకేలకు, ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. జనసేన రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ ఖరారయ్యారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. అయితే, జనసేన నుంచి రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తొలుత ఒకరిద్దరు ప్రముఖ నాయకుల పేర్లు వినిపించినా.. చివరికి అధినేత పవన్ కల్యాణ్ మాత్రం పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపారు. పార్టీకి ఆయన చేసిన సేవలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని, పవన్ కల్యాణ్ ఆయన పేరును ఖరారు చేశారు. దీంతో, జనసేన తరఫున తొలిసారి పెద్దల సభ (రాజ్యసభ)కు వెళ్లే లక్కీ ఛాన్స్ లింగమనేని రమేశ్‌ను వరించింది. ఇక, టీడీపీకి దక్కిన మూడు రాజ్యసభ సీట్లపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది.

- Advertisement -

Also read: TGPSC: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. 24 గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

రాజ్యసభలో సామాన్యుడి గొంతు వినిపించడమే లక్ష్యం..

రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం లింగమనేని రమేష్‌ స్పందించారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ఎన్డీయే పెద్దలు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అభ్యర్థిత్వంపై లింగమనేని రమేష్ స్పందిస్తూ, “పవన్ కల్యాణ్ గారు నాకు పదవి కాదు, బలమైన బాధ్యతను అప్పగించారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాను” అని తెలిపారు. రాజ్యసభలో సాధారణ పౌరుడి గొంతును వినిపించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని.. జనసేన తరఫున తనను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News