ఏపీ శాసనమండలి సభ్యుడిగా జనసేన నేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు(Nagababu) ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు నాగబాబు చేత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇక నాగబాబుతో పాటు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు ( Somu veerraju), కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన వీరు కూటమి సభ్యుల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.


