జపాన్ కౌన్సల్ జనరల్ (చెన్నై) తగ మసయుకి (Taga Masayuki) అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా సిఎస్ జవహర్ రెడ్డి, జపాన్ కౌన్సల్ జనరల్ తగ మసయుకి కొద్ది సేపు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జపాన్ కౌన్సల్ జనరల్ తో పాటు వారి ప్రతినిధులు పాల్గొన్నారు.

