Friday, April 18, 2025
Homeఆంధ్రప్రదేశ్JC Prabhakar Reddy: జేసీబీల‌తో నేల‌మ‌ట్టం చేస్తాం.. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వార్నింగ్‌

JC Prabhakar Reddy: జేసీబీల‌తో నేల‌మ‌ట్టం చేస్తాం.. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వార్నింగ్‌

టీడీపీ సీనియ‌ర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి(JC Prabhakar Reddy) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. ఆల‌య కుంట‌ను క‌బ్జా చేసిన వారిని ఎట్టిప‌రిస్థితుల్లోనూ వ‌దిలిపెట్ట‌బోమ‌ని హెచ్చ‌రించారు. ప‌ట్ట‌ణ అభివృద్ధి కోసం అక్ర‌మ నిర్మాణాల‌ను జేసీబీల‌తో నేల‌మ‌ట్టం చేస్తామ‌ని హెచ్చరించారు. గ‌త వైసీపీ హ‌యాంలో ఆల‌య కుంట భూమిలో ఎక్క‌డ‌పడితే అక్క‌డ అక్ర‌మ నిర్మాణాలు నిర్మించార‌ని జేసీ ఆరోపించారు. ఈ కుంటలో ఇళ్లు నిర్మించిన వారి వ‌ద్ద ఏమైనా ప్ర‌భుత్వ అధికారిక రికార్డులు ఉంటే తీసుకురావాల‌ని సూచించారు. లేనిప‌క్షంలో పార్టీలకు అతీతంగా అక్ర‌మ నిర్మాణాల‌ను జేసీబీల‌తో కూల్చివేయ‌డం జ‌రుగుతుంద‌ని స్పష్టం చేశారు. దీంతో జేసీ వ్యాఖ్యలు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -

కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలను హెచ్చరిస్తున్నారు. కబ్జాలకు పాల్పడినా, అక్రమ వసూళ్లు చేసినా, ఇసుక తవ్వకాలు జరిపినా ఉపేక్షించేంది లేదని తేల్చిచెప్పారు. అలాగే ఇటీవల బీజేపీ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News